అక్టోబరులో దృశ్యం 3…సాధ్యమైనా?

Viswa

Web Stories

Drishyam 3: మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్, హిందీలో అజయ్‌దేవగన్, తెలుగులో వెంకటేశ్‌ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ‘దృశ్యం 3’ సినిమా విడుదలకు సన్నాహాలు మొదలైయ్యాయి.

మలయాళ ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. హిందీ వెర్షన్‌ ‘దృశ్యం 3’ షూటింగ్‌ మొదలైంది. అక్టోబరు 2న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఇక తెలుగువెర్షన్‌ ‘దృశ్యం 3’ (Drishyam 3 Update) పై నిర్మాత డి. సురేష్‌బాబు ఓ కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు.

వెంకటేశ్‌ హీరోగా ‘దృశ్యం 3’ సినిమా ఉంటుందని, త్రివిక్రమ్‌తో వెంకటేశ్‌ చేస్తున్న ‘ఆదర్శకుటుంబం’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్‌ను వెంకటేశ్‌ పూర్తి చేస్తారని డి.సురేష్‌బాబు వెల్లడించారు. అంతేకాదు..వీలైతే..హిందీ వెర్షన్‌తో పాటుగా, ‘దృశ్యం 3’ సినిమాను అక్టోబరులోనే రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నట్లుగా డి.సురేష్‌బాబు వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి (Venkatesh Drishyam 3 Release date).

అయితే దర్శకుడు త్రివిక్రమ్‌ స్టైల్‌ కాస్త స్లోగా ఉంటుంది. మరి..‘ఆదర్శకుటుంబం’ సినిమాను త్రివిక్రమ్‌ పూర్తి చేసిన తర్వాత ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. మరి..దృశ్యం 3 సినిమా ఈ ఏడాది లోనే రిలీజ్‌ అవుతుందా? వేచి…చూడాలి.

మరోవైపు..వచ్చే సంక్రాంతికి వెంకటేశ్‌ హీరోగా అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌గా ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రానుందనే టాక్‌ వినిపిస్తోంది. మరి..ఈ గ్యాప్‌లో వెంకటేశ్‌ ‘దృశ్యం 3’ సినిమా షూట్‌ను ఎప్పుడూ పూర్తి చేస్తారనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది.

Please Share
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi