Rashmika mandhana in lesbian roll : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న, ఇప్పుడు ఒక బోల్డ్ ప్రాజెక్టుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షాహిద్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కాక్ టెయిల్ 2’ చిత్రంలో రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఆమె పోషించబోయే పాత్రకు సంబంధించిన లీక్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారాయి.
2012లో విడుదలైన సూపర్ హిట్ ‘కాక్ టెయిల్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. హోమీ అదజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికతో పాటు కృతి సనన్ కూడా మరో కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రష్మిక, కృతి సనన్ స్వలింగ ప్రేమికులుగా (లెస్బియన్లు) కనిపించబోతున్నారట. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో షాహిద్ కపూర్‌తో వీరిద్దరి బంధం ఏ మలుపు తీసుకుంటుంది అనేది కథాంశమని వినికిడి.ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దర్శకుడు హోమీ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లోనే అత్యంత స్పెషల్ మూవీగా అభివర్ణించారు. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ రానుంది.
దక్షిణాదికి చెందిన స్టార్ హీరోయిన్లు సాధారణంగా ఇలాంటి సాహసోపేతమైన మరియు బోల్డ్ పాత్రలు చేయడానికి కాస్త వెనుకాడుతుంటారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, రష్మిక తన కెరీర్‌లో చేస్తున్న అత్యంత విభిన్నమైన ప్రయోగంగా ఇది నిలుస్తుంది. ఈ పాత్రతో రష్మిక బాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.
Spinning some reels over at one21slots. They have a decent selection of games. Wish me luck!
Trying out one21game. It’s something new, so wanted to explore what the platform has to offer in the gaming space.
Looking good so far on kk99gamedownload. Pretty fast downloads. Will likely download a few more to test out.