ప్లాప్‌ సినిమా హీరోయిన్స్‌కు వరుస చాన్స్‌లు

Viswa
2 Min Read

Web Stories

tollywood Heroines: ఫ్లాప్‌ సినిమా హీరోయిన్‌లకు తెలుగులో భలే చాన్స్‌లు లభిస్తున్నాయి. ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ తమిళ మూవీ ‘డ్రాగన్‌’తో కయాదు లోహర్‌ పాపులర్‌ అయ్యారు. ఈ సినిమా తెలుగులో ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ పేరుతో విడుదలైంది. రీసెంట్‌గా వచ్చిన విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’తో కయాదు లోహర్‌ పాపులర్‌ పేరు టాలీవుడ్‌లో వినిపించింది కానీ, చెప్పాలంటే.. అంతకు ముందే శ్రీవిష్ణు చేసిన ‘అల్లూరి’ సినిమాతో తెలుగులోకి వచ్చారీ బ్యూటీ. విచిత్రంగా ‘అల్లూరి, ఫంకీ’...రెండూ డిజాస్టర్‌ సినిమాలే.

కానీ స్ట్రయిట్‌ తెలుగు సినిమాల్లో కయాదుకు మంచి చాన్స్‌లే లభిస్తున్నాయి. నాని లేటేస్ట్‌ మూవీ ‘ది ప్యారడైజ్‌’లో కయాదు హీరోయిన్‌గా చేస్తు న్నారని తెలిసింది. అలాగే ఇప్పుడీ బ్యూటీకి తెలుగులో మరో రెండు సినిమాల్లో నటించే అవకాశాలు కూడ వచ్చాయటన. ఇక్కడ చర్చించు కోవాల్సిన విషయం ఏంటంటే…ఈ యంగ్‌ బ్యూటీ కోటి రూపాయాల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారట. సడన్‌గా తన రెమ్యూ నరేషన్‌ను 30శాతం వరకు పెంచేశారట. ఇలా తెలుగులో వరుస ప్లాఫ్‌ సినిమాలూ ఉన్నప్పటికీని, ఇలా కయాదు రెమ్యూనరేషన్‌ పెంచడం అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ హాట్‌ టాపిక్‌గా మారింది.

అలాగే శ్రీకాంత్‌ కొడుకురోషన్‌ యాక్ట్‌ చేసిన ‘చాంపియన్‌’ సినిమాతో తెలుగు వచ్చారు అనస్వర రాజన్‌. ఈ సినిమా కూడా ప్లాప్‌. కానీ అనస్వర రాజన్‌కు తెలుగులో మంచి అవకాశాలే వస్తున్నాయట.టాలీవుడ్‌లో వరుస ప్లాప్‌ సినిమాలతో సతమతమైన శ్రీలీల రీసెంట్‌గా తమిళంలో ‘పరాశక్తి’ అనే సినిమా చేశారు. ఇది ప్లాప్‌ మూవీ. కానీ ధనుష్‌ సినిమాలో ఓ హీరోయిన్‌గా చేసే చాన్స్‌ దక్కించుకున్నారు శ్రీలీల. అంతేనా..అజిత్‌ లేటస్ట్‌ మూవీలో కూడా శ్రీలీలయే హీరోయిన్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది.

సమంత, పూజాహెగ్డే వంటి స్టార్లు తెలుగులో సినిమాలు తగ్గించడం, ప్రస్తుతం టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్న మీనాక్షీ చౌదరి, భాగ్యశ్రీభోర్సే వంటి హీరో యిన్స్‌కు డేట్స్‌ ఖాళీగా లేకపోవడంతో, ప్లాప్‌ సినిమా హీరోయిన్స్‌ అయినా కూడా చాన్స్‌లొస్తున్నట్లుగా తెలుస్తుంది. , స్క్రీన్‌ ప్రజెన్స్‌ బాగా ఉండి, పెర్ఫార్మెన్స్‌ చేయగల హీరోయిన్స్‌కు సినిమా రిజల్ట్‌లతో సంబంధం లేకుండ చాన్స్‌లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi