ఎన్టీఆర్ – నీల్ మూవీలో యంగ్ హీరో గెస్ట్ రోల్..?

Kumar NA
1 Min Read

Web Stories

Young Hero guest roll in NTR Prashant neel movie:  యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా వినిపిస్తున్న ఒక ఆసక్తికర వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇటీవలే జోర్డాన్‌లో ఒక కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ చేరుకుంది.

తాజా సమాచారం ప్రకారం, మార్చి నెలాఖరులో రామోజీ ఫిల్మ్ సిటీలో మరో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై ఒక భారీ సాంగ్‌తో పాటు, హై-లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక అదిరిపోయే సర్ప్రైజ్‌ను సిద్ధం చేసినట్లు వినికిడి. ఒక కీలకమైన అతిథి పాత్ర కోసం అక్కినేని యంగ్ హీరో అఖిల్ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథను మలుపు తిప్పే విధంగా అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, నీల్ మేకింగ్ స్టైల్‌కు తోడు అఖిల్ కూడా తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం.

అయితే, ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్‌ను గ్లోబల్ స్థాయిలో మరో మెట్టు ఎక్కించేలా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్క్రిప్ట్ వర్క్ కోసమే చాలా సమయం తీసుకున్న నీల్, మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు. తారక్ మాస్ పవర్‌ను వెండితెరపై ప్రశాంత్ నీల్ ఏ రేంజ్‌లో చూపిస్తారో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah