Carmeni Selvam movie director Ram Chakri: ‘‘వెండితెరపై మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబించేలా ‘కార్మేని సెల్వం’ సినిమా ఉంటుంది. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారందరికీ, ఈ సినిమా ధైర్యాన్ని ఇస్తుంది. ‘కార్మేనీ సెల్వం’ సినిమా చూసిన, ప్రతిఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’’ అని దర్శకుడు రామ్ చక్రి చెప్పారు. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రధారులుగా, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర కీలక పాత్రల్లో (Carmeni Selvam movie Cast and crew)నటించిన సినిమా ‘కార్మేని సెల్వం’. రామ్‌చక్రి దర్శకత్వంలో పాత్ వే ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న (Carmeni Selvam movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం దర్శకుడు రామ్ చక్రి పంచుకున్న విశేషాలు…..
– ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి సర్వసాధారణమైపోయాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనే ఆసక్తికరమమైన అంశాలను మా ‘కార్మెని సెల్వం’ చిత్రంలో చూపిస్తున్నాము. ఈ సినిమా చాలా రియ లిస్టిక్గా ఉంటంది. మధ్యతరగతి కుటంబంలోని తండ్రిగా సముద్రఖనిగారు అద్భుతంగా నటించారు. నటుడిగా అద్భుతమైన భావోద్వేగాలను చూపించారు. ఆయన క్యారెక్టర్‌లోని ప్రతి షేడ్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. ఆయన పాత్రతో పాటుగా, గౌతమ్వాసుదేవ్మీనన్, లక్ష్మిప్రియా, అభినయ పాత్రలూ ప్రేక్షకు లను మెప్పిస్తాయి.

– విదేశాల్లో ఉంటున్న వారు, స్వదేశంలోని వారి కుటుంబసభ్యులను చూసేందుకు ఏడాది కనీసం రెండు సార్లు వీలు కల్పించుకోవాలని నేను ఈ సందర్భంగా ఆశ పడుతున్నాను. మా కార్మెనీ సెల్వం సినిమా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. ఇక సంగీత దర్శకుడు రామానుజన్, కెమెరామేన్ యువరాజ్, ఎడిటర్ జగన్…ఇలా మా టెక్నికల్ టీమ్ మా సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. టెక్నికల్‌గా మా సినిమా ఎంత క్వాలిటీగా ఉంటుందన్న విషయం ఆడి యన్స్‌కు స్క్రీన్‌పై తెలుస్తుంది.
– తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు భిన్నమైన కోణాలు కనిపిస్తున్నాయి. తెలుగులో నేను చూసిన తొలి సినిమా ‘ఆర్య’. ఈ తరహా ఎనర్జిటిక్ అండ్ కమర్షియల్ సినిమాలు ఉంటూనే, మరోవైపు శేఖర్‌కమ్ములగారి ‘ఆనంద్, గోదావరి’ సినమా వంటి సినిమాలూ ఉన్నాయి. దర్శకులు శేఖర్ కమ్ములగారితో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కలేదు. కానీ ఆయన్ను నేను గురువుగా భావిస్తాను. అలాగే నా దర్శక గురువుగా కేవీ గుహన్గారిని చెబుతాను. ఈ ఇద్దరూ నాకు స్ఫూర్తి.
[7947]win77 Login at Register – Legit Slot Games via GCash,Gamitin ang win77 login app para sa mabilis na access. Mag-register account na para sa legit slot games gcash at pinakamabilis na cashout casino. Sali na! visit: win77
I tuink this iis onee off the most vital invo forr me.
Andd i amm glad reding your article. Buut want too remark oon sime general things, Thee
wwbsite style iss ideal, tthe arficles iss really niche :
D. Goood job, cheers xnxx