please subscribe to Tollywoodhub YouTube channel

రామాయణ సినిమా నుంచి రామ గ్లింప్స్‌ చూశారా..

Viswa

Web Stories

Ramayana Rama Glimpses: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రామాయణ’ (Namit Malhotra’s Ramayana) సినిమా నుంచి ‘రామ’ గ్లింప్స్‌ రిలీ జైంది. భారతీయ ప్రముఖ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘రామాయణ’.ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగాసన్నీ డియోల్, రావణుడిగా యశ్, సూర్పణకగా రకుల్‌ ప్రీత్‌ సింగ్, మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. ‘దంగల్‌’ ఫేమ్‌ నితీష్‌ తివారి (Namit Malhotra’s Ramayana Director Nitesh Tiwari) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నమిత్‌ మల్హోత్రా, యశ్‌ ఈ ‘రామాయణ’ (Ramayana  Movie)సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రామాయణ సినిమా రెండు భాగాలుగా రిలీజ్‌ కానుంది. ఈ ‘రామాయణ’ సినిమాను దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో, నిర్మిస్తున్నామని ఓ సంద ర్భంగా ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన నమిత్‌ మల్హోత్రా పేర్కొన్నారు.

Ranbirkapoor Look From hindi Ramayana Movie
Ranbirkapoor Look From hindi Ramayana Movie

తొలిభాగం ‘రామాయణ పార్టు 1’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది. తొలిభాగం షూటింగ్‌ పూర్తయింది. మలిభాగం చిత్రీకరణ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.

ఏప్రిల్‌ 2న హనుమాన్‌ జయంతి సందర్భంగా ‘రామాయణ’ సినిమా నుంచి ‘రామ’ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రామాయణ సినిమాలో రాము డుగా నటించిన రణ్‌బీర్‌కపూర్‌ పాత్రకు చెందిన వీడియో ఇది. రణ్‌బీర్‌కపూర్‌ లుక్స్, మేకోవర్‌ బాగున్నాయి. కానీ వివీఎఫ్‌ పట్ల కొందరు నెటిజన్లు పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నట్లుగా లేరు. ఇక ఈ ‘రామాయణ’ సినిమాకు ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఏఆర్‌ రెహమాన్‌తో పాటుగా, హాలీ వుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హాన్స్‌ జిమ్మర్‌ సంగీతం అందిస్తున్నారు.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi