మధ్యతరగతి కుటంబం అనుబంధాలు, సమస్యలు, కలలు…ఈ తరహా కథాంశంతో చాలా సినిమాలు వస్తుంటాయి. మన దేశంలో సగానికిపైగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ఇలాంటి కథాంశంతో రూపొందిన సినిమాయే ‘కార్మేనీ సెల్వం’. ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్స్‌లో విడుదలైంది. మరి..ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంత మేర ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చదివేద్దాం (Carmeni Selvam Review).
- సినిమా: కార్మేని సెల్వం నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపీ (Carmeni Selvam Cast And crew)
- దర్శకుడు: రామ్ చక్రి నిర్మాణం: అరుణ్ రంగరాజులు సంగీతం: మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ డీవోపీ: యువరాజ్ దక్షణ్ ఎడిటింగ్: జగన్ అర్వి,దినేష్ ఎస్ నిడివి: 2 గంటల 24 నిమిషాలు విడుదల తేదీ: 3 ఏప్రిల్ 2024 (Carmeni Selvam Release date)
- రేటింగ్: 3.5/5 (Carmeni Selvam Review And Rating)
- కథ
- విశ్లేషణ
- నటీనటులు-పెర్ఫార్మెన్స్
- ఫైనల్‌గా…మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబించే సినిమా కార్మేనీ సెల్వం. కుటుంబ అనుబంధాలు, విలువలను మరోసారి గుర్తుచూస్తూ, ఆడియన్స్‌కు గుర్తుండిపోయే సినిమా ఇది. ప్రతి మధ్యతరగతి, ఫ్యామిలీ ఆడియన్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. తమను తాము స్క్రీన్‌పై చూసుకున్నట్లుగా ఫీల్ అవతారు. కుటుంబ విలువలు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను ఇష్టపడే వారికి, కార్మెనీ సెల్వం సినిమా తప్పక నచ్చుతుంది.
సినిమా: కార్మేని సెల్వం
నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపీ (Carmeni Selvam Cast And crew)
నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపీ (Carmeni Selvam Cast And crew)
దర్శకుడు: రామ్ చక్రి
నిర్మాణం: అరుణ్ రంగరాజులు
సంగీతం: మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ
డీవోపీ: యువరాజ్ దక్షణ్
ఎడిటింగ్: జగన్ అర్వి,దినేష్ ఎస్
నిడివి: 2 గంటల 24 నిమిషాలు
విడుదల తేదీ: 3 ఏప్రిల్ 2024 (Carmeni Selvam Release date)
నిర్మాణం: అరుణ్ రంగరాజులు
సంగీతం: మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ
డీవోపీ: యువరాజ్ దక్షణ్
ఎడిటింగ్: జగన్ అర్వి,దినేష్ ఎస్
నిడివి: 2 గంటల 24 నిమిషాలు
విడుదల తేదీ: 3 ఏప్రిల్ 2024 (Carmeni Selvam Release date)
రేటింగ్: 3.5/5 (Carmeni Selvam Review And Rating)
కథ
సెల్వం (సముద్రఖని), శాంతి (లక్ష్మిప్రియ) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఒక కుమారుడు బాలు. సెల్వం కారుడ్రైవర్. శాంతి ఇండ్లీ బండి నడుపు తుంటుంది. ఉన్నంతలో సంతోషంగా జీవించాలనే మనస్తత్వం సెల్వంది. శాంతికి ఆశలు, ఆశయాలు ఎక్కువ. సొంత కారు,సొంత ఇల్లు కట్టు కోవాలని శాంతి కోరిక. ఇందుకోసం జీవితంలో ఎలాగైనా ఎదగాలి అని ఆశపడుతుంటుంది. అయితే ఓ సారి తన మేనకోడలు ఫంక్షన్‌కు వెళ్లి, సారె ఇవ్వడంలో సెల్వం–శాంతి అవమానపడతారు. సారెలో డబ్బు తక్కువగా ఇచ్చారని, సెల్వం బావ వీరిని అవమానిస్తాడు. మరో సమయంలో బాలుకి గాయం అవు తుంది. వైద్యానికి డబ్బులు లేక, సమయానికి సాయం చేసే వారు లేక, తన బావ దగ్గరే సెల్వం రూ.10 వేలు అప్పు చేయాల్సి వస్తుంది. ఇది శాంతికి ఏ మాత్రం నచ్చదు. ఈ అప్పును శాంతి భిక్షంలా భావించి, మరో అవమానంలా ఫీల్ అవుతుంది. ఈ అప్పును ఎలాగైనా తీర్చి వేయాలని సెల్వంతో అంటుంది. మరోవైపు సెల్వం కారు యజ మాని సంపత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) వేకేషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్తారు. దీంతో ఓనర్ కారును కాల్ ట్యాక్సీగా మార్చి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తాడు సెల్వం. అయితే ఓ సందర్భంగా ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాడు. బాగా సంపాదించాలంటే…బాగా ఖర్చు చేయాలని, అవసరమైతే అప్పులు చేయాలని అతను చెప్తాడు. దీంతో..తన లైఫ్‌స్టైల్‌ను సెల్వం మార్చు కుంటాడు. అప్పులు చేసి, తిప్పలు పడుతుంటాడు. అప్పుల వారి బాధ తట్టుకోలేక, దుబాయ్‌లోని షార్జాకు వెళ్లి అక్కడ కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? మరి..సెల్వం తన కొడుకును ఎలా మిస్ అయ్యాడు? ఎంత సఫర్ అయ్యాడు? సెల్వం సమస్యకు పరిష్కారం ఏమిటి? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ
మధ్యతరగతి కుటుంబాల జీవితాలు, వారి కలలు, ఆ కలలను సాకారం చేసుకోవడంలో వారు ఎదుర్కొనే సమస్యలను వెండితెరపై ఎంతో చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు రామ్ చక్రి. మధ్యతరగతి కుటుంబాల విలువలను గుర్తుచేస్తూ, రియలిస్టిక్‌గా ఈ సినిమాను ఆడియన్స్‌కు చూపించే ప్రయత్నంలో రామ్ చక్రి పూర్తిగా సఫలం అయ్యారు. ‘అనవసరమైనవి ఉంటే…అవసరమైనవి కోల్పోతాం..’అని ఈ సినిమా క్లైమాక్స్
లో వచ్చే డైలాగ్, ఈ సినిమాలోని డెప్త్‌ను తెలియజేస్తుంది.

గొప్పలకు పోయి అప్పులు చేస్తే, ఎలాంటి తిప్పలు పడతామో మరోసారి బాధ్యతగా గుర్తుచేస్తుంది. సెల్వం–శాంతిల దాంపత్య జీవితం, సెల్వం– బాలుల తండ్రీకొడుకుల అనుబంధం కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క ఆడియన్ ఈ సినిమాకు రిలేట్ అయ్యేలా, దర్శకుడు సినిమా తీశాడు. ఈ సినిమా తొలిభాగంలో సెల్వం–శాంతికి స్టార్ హోటల్‌కు వెళ్లి, భోజనం చేసే సీన్ తాలుకూ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రతి ఒక్క ఆడియన్ తమ జీవితంలో ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారని చెప్పవచ్చు. కుటుంబానికి దూరమైన సెల్వం, ఎంతటి మానసిక క్షోభ అనుభవించాడు? డబ్బు కోసం అప్పు చేసి, ఎలాంటి తప్పులు చేశాడు? ఇందుకు ఎలాంటి శిక్షను ఎదుర్కొ న్నాడు? అనేది సినిమాలో, మనసుకు హత్తుకునేలా దర్శకుడు రామ్‌చక్రి చూపించారు. క్లైమాక్స్ కూడా బాగా కుదిరింది. మరి..ముఖ్యంగా సినిమాలో ఎలాంటి వల్గారిటీ -అసభ్య సన్నివేశాలకు తావు లేకుండ…ఈ సినిమాను తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే.అక్కడక్కడ కాస్త సాగదీత, ఊహాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీని, కథలోని నాటకీయత, భావోద్వేగాలు..ఈ లోటను ఆడియన్స్ గుర్తు చేయకుండ ఉండేలా చేస్తాయి.
నటీనటులు-పెర్ఫార్మెన్స్
తనదైన శైలి నటనతో సముద్రఖని మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. సెల్వం పాత్రలోని భావోద్వేగాలను, స్క్రీన్‌పై చక్కగా చూపించారు. మధ్య తరగతి భర్తగా, తండ్రిగా, స్వార్థం లేకుండ కుటుంబం కోసం కష్టపడే వ్యక్తిగా..సముద్రఖని చక్కని నటనను ప్రదర్శించారు. ఇక ఆయన భార్య శాంతిగా లక్ష్మీ ప్రియ నటన సూపర్ అనే చెప్పాలి. పత్రి మహిళ శాంతి పాత్రకు రిలేట్ అవుతుందని కచ్చితంగా చెప్పగలిగేలా, ఈ సినిమా ఉంటుంది. సంపత్‌గా గౌతమ్‌వాసుదేవ్‌మీనన్, దేవిగా అభినయ పాత్రల స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే అయినప్పటికీని, కథపై బల మైన ఇంపాక్ట్ ఉన్న రోల్స్ చేశారు. కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్…లు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించి, వారి రోల్స్‌కు పూర్తి న్యాయం చేశారు. వాస్తవికతకు దగ్గరగా, ఈ కథను తెరకెక్కించిన రామ్‌చక్రిని అభినందించాల్సిందే. మధ్యతరగతి కుటుంబీకులకు, మరి..ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ దక్షణ్ విజువల్స్, రామానుజన్ మ్యూజిక్ ఈసినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు.

References:
Choctaw casino pocola ok https://bridgedesign.site/wiki/HitnSpin_Alternative_Die_5_besten_Alternativen_hier_Mai_2026_hnliche_Casinos_hier
References:
Casino sans telechargement https://beau-rivage-casino-mississippi.online-spielhallen.de/
References:
Casino new orleans https://busforsale.ae/profile/shaynaawp18145