please subscribe to Tollywoodhub YouTube channel

Viduthalai Part 2 Review: విజయ్‌సేతుపతి ‘విడుదల 2’ తెలుగు రివ్యూ

విజయ్‌సేతుపతి, సూరి, మంజువారియర్‌, గౌతమ్‌వాసుదేవ్‌ మీనన్‌ ప్రధాన పాత్రల్లో నటించి, వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన 'విడుదల పార్టు 2' తెలుగు రివ్యూ. విడుదల పార్టు1కు సీక్వెల్‌గా విడుదల పార్టు 2 రూపొందింది.

Viswa
3 Min Read
Viduthalai Part 2

Web Stories

Viduthalai Part 2 Review: పెరుమాళ్‌ అలియాస్‌ మాస్టర్‌ ఆలియాస్‌ కురుçప్పన్‌ (విజయ్‌ సేతుపతి)ని పోలీస్‌ కానిస్టేబుల్‌ కుమరేషన్‌ (సూరి) పోలీసులకు పట్టించడంతో ‘విడుదల పార్టు 1’ కథ ముగిసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక్క డ్నుంచే రెండో భాగం మొదలువుతుంది. పెరుమాళ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాలనుకుంటారు. కానీ పెరుమాళ్‌ పోలీసుల అదుపులో ఉన్న విషయం బయటకు రావడంతో, మరో చోటుకు పెరుమాళ్‌ను తర లించి, అక్కడ పెరుమాళ్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలని పోలీసులు ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలో పోలీసులకు తన గతం ఏంటో, తాను ఎందుకు నక్సలిజం వైపు రావాల్సి వచ్చిందో అన్న సంగతులను చెబుతాడు పెరుమాళ్‌. మరోవైపు పెరుమాళ్‌ను తప్పించేందుకు ప్రజాదళం ప్రయత్నిస్తుంటుంది. మరి..పెరుమాళ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారా? తమ నాయకుడైన పెరుమాళ్‌ను ప్రజాదళం సభ్యులు ఎలా కాపాడాలనుకున్నారు? కేకే (కిశోర్‌), మహాలక్ష్మీ (మంజువారియర్‌), డీఎస్‌పీ సునీల్‌ మీనన్‌ (గౌతమ్‌వాసుదేవ్‌ మీనన్‌)ల వల్ల పెరుమాళ్‌ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? సూరికి ప్రమోషన్‌ లభించిందా? అన్న విషయాలను సినిమాలో చూడాలి (Viduthalai Part 2 Review)

Mufasa: The Lion King Review: ముఫాసా: ది లయన్‌కింగ్‌ రివ్యూ

పెరుమాళ్‌ (విజయ్‌సేతుపతి Vijay Sethupathi), డీఎస్‌పీ సునీల్‌ (గౌతమ్‌వాసుదేవ్‌ మీనన్‌) ల మధ్య వచ్చే సీన్స్, ఆ వెంటనే ఓ ప్లాష్‌బ్యాక్‌ ఎసిపోడ్స్‌తో సినిమా కాస్త ఆసక్తికరంగానే ప్రారంభం అవుతుంది. జమీందారి వ్యవస్థలోని అమ్మాయి అయిన మహాలక్ష్మి (మంజువారియ Manju Warrier), పెరుమాళ్‌ (విజయ్‌సేతుపతి)లా లవ్‌ట్రాక్‌ కూడా ఫర్వా లేదు. అలాగే పోలీస్‌ వ్యవస్థలోని లోపాలు, జమీందారి వ్యవస్థ ఆధిపత్యపు హింసాత్మాక ధోరణి వల్ల అణగదొక్క బడుతున్న బలహీన వర్గాల ప్రజల బాధలు, వీరి తరఫున పోరాటం చేసే ప్రజాదళం నాయ కులు వంటి అంశాలను దర్శకుడిగా వెట్రిమారన్‌ తనదైన స్టైల్లో చూపించారు.

కానీ కథ బరువు అంతా విజయ్‌సేతుపతిపైనే మోపారు వెట్రిమారన్‌. దీంతో అనవసరమైన ఎపిసోడ్స్, సాగదీత సన్నివేశాలను సినిమాలో పెట్టాల్సి వచ్చింది. విజయ్‌సేతుపతి పాత్రపై ఫోకస్‌ అంతా ఉంటుంది కాబట్టి సూరి పాత్ర తేలిపోయింది. దీంతో కథ ఎక్కడో పక్కదారి పట్టిందన్న ఆలోచనలు ఆడియన్స్‌లో కలుగుతాయి. అయితే కేకే హత్యకు ప్రతీకారం తీర్చుకునే పెరుమాళ్‌ సీన్స్‌ సినిమాలో హై ఇస్తాయి. ఇక్కడే ఇంట్రవెల్‌ కూడా వస్తుంది. సెకండాఫ్‌లో అయితే సాగదీత సన్నివేశాలు మరింతగా ఉంటాయి. పెరుమాళ్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలని పోలీసుల కస్టడీ, మరోవైపు పెరుమాళ్‌ను కాపాడేందుకు ప్రజాదళం వేసే ఎత్తులు .ఈసీన్స్‌తో సెకండాఫ్‌ సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే షూటౌట్‌ ఎపిసోడ్‌ అయితే ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షిస్తుంది. కథలోని నాన్‌–లీనియర్‌ స్క్రీన్‌ ప్లే ఆడియన్స్‌కు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. సినిమా నిడివి కూడా మూడు గంటల పాటు ఉంటుంది.

Upendra’s UI The Movie Review: ఉపేంద్ర యూఐ మూవీ రివ్యూ

పెరుమాళ్‌గా విజయ్‌సేతుపతి సినిమాలో అద్భుతంగా నటించారు. కథను ముందుండి నడిపించారు. కథలో ఉన్న సమయంలో సూరి (Soori) పాత్ర ఫర్వాలేదు. సూరి పాత్రకు పెద్ద స్క్రీన్‌ ప్రజెన్స్‌ కూడా దక్కలేదు. వీరిద్దరి పాత్రల దృష్టిలో వెట్రిమారన్‌ చూసిన చొరవ, శ్రద్ధ ఇతర పాత్రల ముగింపు విషయంలోనూ చూపిస్తే బాగుండేది. గౌతమ్‌వాసుదేవ్‌ మీనన్, రాజీవ్‌ మీనన్, కన్నడ కిశోర్‌లు…వారి పాత్రల పరిధిలో వారు చేశారు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం ఇళయరాజా మ్యూజిక్‌. సినిమాలోని పావురమా..పాట శ్రోతలను అలరిస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ వేల్‌రాజా విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా…: కాస్త ఒపిగ్గా చూస్తే విడుదల 2 ఫర్వాలేదనిపిస్తుంది. కానీ నక్సలిజం, కమ్యూనిజం, జమీందారి వ్యవస్థ వంటి విషయాలపై అవగాహన ఉన్నవాళ్లకు ‘విడుదల 2’ మెప్పిస్తుంది.

రేటింగ్ : 2.50/5

 

 

 

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi