NTR Dragon: కేజీఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారనగానే, ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. పైగా ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడు… ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో షూటింగ్ చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే… రీసెంట్ టైమ్స్‌లో ‘డ్రాగన్’ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్‌డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కలవరపెడున్నవే కావడం గమనార్హం.
కొంత షూటింగ్ పుటేజ్‌ని స్క్రాప్ చేశారని, ఎన్టీఆర్ లుక్ మారిందని దీంతో షూట్ ఆలస్యమౌతోందని, ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదని, అనూహ్యంగా ‘డ్రాగన్’ సినిమా నుంచి టోవినోథామస్ తప్పు కున్నారని..ఇలా అన్నీ ‘డ్రాగన్’ సినిమాను గురించిన నెగటివ్ వార్తలే ప్రచారంలోకి వచ్చాయి. ఏదో ఒక నెగటివ్ వార్త ప్రచారంలోకి రావడం, మేకర్స్ ఆ వార్తలను ఖండించడం..ఇదే జరుగుతోంది. తాజాగా మళ్లీ ఇదే రిపీటైంది.

ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ గుడ్ న్యూస్ కోరుకుంటున్నారు. పైగా ‘డ్రాగన్’ నుంచి ఓ పాట లేదా టీజర్ లేదా రిలీజ్ డేట్…ఏదైనా…ఒక పాజిటివిటీ క్రియేట్ చేసే, ఓ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come…
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2026
వచ్చే నెల మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్రాగన్’ సినిమా అప్‌డేట్ రావొచ్చు. కానీ ఈ లోపు ఈ సినిమాకు పాజిటివ్ మైలేజ్ టాక్ ఉండేలా ఏదో ఒక అప్‌డేట్ అఫిషియల్‌గా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ సినిమాను తొలుత జనవరి 9, 2026న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 25కి వాయిదా వేశారు. రీసెంట్‌గా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో అనిల్‌కపూర్ ఓ కీ రోల్ చేస్తున్నారు.