Pallichattambi Movie Review in telugu: ‘మిన్నల్ మురళి, 2018:ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో, ఏఆర్‌ఎమ్, లూఫీసర్ (జితిన్‌రామ్‌దాస్)’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మలయాళ నటుడు టోవినోథామస్ తెలిసినవాడే. ‘సలార్’ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా, ఇప్పుడు మహేశ్‌బాబు చేస్తున్న ‘వారణాసి’ సినిమాలో విలన్‌గా చేస్తున్న పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా తెలుగు ప్రేక్షకులుకు తెలుసు. వీరిద్దరు కలిసి నటించిన సినిమా మలయాళ సినిమాయే ‘పళ్లిచట్టంబి’. మలయాళంలో ఈ నెల 15న రిలీజైన, ఈ సినిమా తెలుగులో మాత్రం ఈ నెల 17న రిలీజైంది. తెలుగు అనువాదం కూడా ఉంది. మరి..ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి మీరూ ఓ లుక్ వేయండి…
సినిమా పళ్లిచట్టంబి (Pallichattambi Review)
నటీనటులు – టొవినో థామస్, కయదు లోహర్, విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్
ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్
డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ
ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ – టిజో టోమీ
మ్యూజిక్ – జేక్స్ బిజోయ్
విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026 (తెలుగు అనువాదం)
నిడివి : 2 గంటల 11 నిమిషాలు
రేటింగ్ : 2.25/5
ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్
డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ
ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ – టిజో టోమీ
మ్యూజిక్ – జేక్స్ బిజోయ్
విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026 (తెలుగు అనువాదం)
నిడివి : 2 గంటల 11 నిమిషాలు
రేటింగ్ : 2.25/5
Pallichattambi Movie Review in telugu: కథ
1930 సమయంలో కథ మొదలువుతుంది. బ్రిటీషర్లను సైతం గడ గడలాండించి తన అధిపత్యాన్ని చాటు కుంటాడు కుంజుంబు నంబియార్ (పృథ్వీరాజ్ సుకుమారన్). అలాగే తనకు ఎదురుతిరిగిన వారిని క్రూరంగా చంపేస్తాడు.
ఈ సన్నివేశం తర్వాత….కథ 1958కి షిఫ్ట్ అవుతుంది. కర్ణాటక–కేరళ సరిహద్దులో ఉన్న కాణియార్ పాత్రం లోని కున్నాపురంలో ఓ చర్చి ఉంటుంది. ఈ ఊర్లో నివసించేవారందరూ దాదాపుగా వలసదారులే. అయితే కేరళలో తొలిసారి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, భూ సంస్కర ణలు తీసుకు వస్తుంది. దీంతో చర్చి స్థలాలను కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుందెనని, అక్కడి చర్చివాళ్లు తమకు అండగా, చర్చి స్థలాలకు అండగా, ఓ చట్టంభి (రౌడీ)ని నియమించుకుంటారు. అతనికి పోతన్ క్రిస్టోఫర్ అని పిలుస్తుం టారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా, క్రిస్టోఫర్ పోతన్ అనే వ్యక్తి క్రిస్టియన్ కాదని, అతని అసలు పేరు కృష్ణ పిళ్లై అని, కమ్యూనిజం పార్టీ సానుభూతిపరుడని తెలుస్తుంది. ఇదే సమయంలో కాణియార్ పాత్రంలోని కొండపై ఉన్న బంగారు గనిపై కుంజుంబు నంబియార్ కన్నుపడుతుంది. ఈ బంగారు గనిని స్వాధీనం చేసుకోవాలంటే, కాణియార్ పాత్రం ఖాళీ కావాలి. కానీ ఇందుకు అప్పుడే అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ అడ్డుపడుతుంది. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? కాణియార్ పాత్రంలో ఎందుకు అల్లర్లు చేలరేగాయి? కృష్ణ పిళ్లై జీవితంలోకి వచ్చిన రెబెక్కా ఎవరు? అన్నది మిగిలిన సినిమాలో చూడాలి (Pallichattambi Movie Review).
విశ్లేషణ
కులం,మతం, ప్రాంతం వేరు అయినా మనుషులంతా ఒక్కటే. దేవుడు ఒక్కరే. అన్న అంశాలను దర్శకుడు ఈ సినిమాతో కన్వే చేయాలని ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. క్రిస్టియన్ చర్చ్‌ను కాపాడేందుకు ఓ అన్యమతస్థుడు రావడం, ఇతను తయారు చేసే ‘క్రిస్టోఫర్ సేన’లో విభిన్న మతాల వారు చేరడం, క్లైమాక్స్ ఫైట్‌లో కులమతా బేధాలు లేకుండ పోలీసులపై కూన్నాపురం గ్రామస్థులు తిరగబడటం అన్న సినిమాలే ఇందుకు నిదర్శనం.
నిజానికి ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. కానీ ఈ చిత్రం దర్శకుడు చెప్పాలనుకున్న విష యాన్ని ఓ డిఫరెంట్ వేలో ట్రై చేశాడు. ఇందుకు కేరళ రాజకీయాలు, అనాటి పళ్లిచట్టంబి వ్యవస్థను కథా వస్తువులుగా వాడుకున్నాడు. కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీని, ఎగ్జిక్యూషన్ సరిగా లేదనిపిస్తోంది. సాధారణ ఆడియన్స్‌ను స్క్రీన్ ప్లే కాస్త కన్‌ఫ్యూజ్ చేస్తుంది. తొలిభాగం స్క్రీన్ ప్లే కాస్త ఆడియన్స్ ఊహాకు తగ్గట్లే సాగుతుంది. కానీ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే భారీ ఫైట్ యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తుంది. అయితే కథ మెయిన్ ఫ్లాట్ కాస్త లేట్‌గా రివీల్ కావడం సరిగా లేదు. కుంజుంబు నంబి యార్‌ను స్క్రీన్‌పై ఇంకాస్త చూపించాల్సింది.

నటీనటుల పెర్ఫార్మెన్స్
కృష్ణ పిళ్లై అలియాస్ పోతన్‌క్రిస్టోఫర్‌గా టోవినోథామస్ మంచి యాక్టింగ్ కనబరచాడు. యాక్షన్, ఎమో షనల్ సీన్స్‌లో మంచిగా యాక్టింగ్ చేశాడు. రెబెక్కాగా కయాదు లోహర్ స్క్రీన్‌పై ఉన్నంతసేపు చక్కగా కనిపించారు. కానీ ఈ రోల్ సడన్‌గా ఎండ్ కావడం, తెలుగు ప్రేక్షకులకు నచ్చదెమో. ఇక నంబియార్‌గా పృథ్వీరాజ్‌సుకుమారన్ కనిపించేంది కొంచెం సేపే అయినా..మంచి ఎలివేషన్ షాట్స్ ఇచ్చాడు దర్శకుడు. కథకు కీలకమైన ఈ పాత్ర చుట్టూ, మరికొంత డ్రామా క్రియేట్ చేసి ఉండాల్సింది. రైరు రామన్నగా శత్రకు మంచి రోల్ లభించింది. స్క్రీన్‌పై క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌లా మెప్పించాడు. జార్జిగా టీజీ రవి, సిద్ధిఖీ, విజయరాఘవన్ వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
‘మనిషిని మనిషిగా చూడని గడ్డపై ఘర్షణలే చెలరేగుతాయి’, ‘చర్చి ఏదైతే ఏంటి..దేవుడు ఒక్కరేగా..’ అంటూ దర్శకుడు తన కలానికి బాగానే పనిచెప్పాడు. డ్రామాకు ఆడియన్స్‌కు కాస్త అర్థ మయ్యేలా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. విజువల్స్ సూపర్‌గా ఉన్నాయి. ఆర్‌ఆర్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా తొలిభాగంలో…వచ్చే ఓ ఫైట్ సీక్వెన్స్ ఎడిటింగ్ బాగుందనిపిస్తుంది.
ఫైనల్‌గా..: మనుషులంతా ఒక్కటే..అనే సందేశాన్ని రాజకీయ, కుల, మతపరమైన అంశాలకు జోడించి చెప్పారు. ఊహించగలిగే సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్. యాక్షన్ లవర్స్‌కు నచ్చుతుంది.