ధురంధర్‌ స్టైల్లో ఎన్టీఆర్‌నీల్‌?

Viswa
1 Min Read

Web Stories

NTRNeel Release Strategy: ఎన్టీఆర్‌నీల్‌ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన రోజునే, ఈ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్‌ అంటూ ప్రకటించారు. ఆ తర్వాత 2026 జూన్‌ 25కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏకంగా ఏడాది పాటు ఆలస్యంగా రిలీజ్‌ అంటూ….2027 జూన్‌ 11న ఎన్టీఆర్‌నీల్‌ అంటూ కొత్త రిలీజ్‌డేట్‌ను ప్రకటించారు.

ఇటీవల జిమ్‌లో ఎన్టీఆర్‌కు గాయమైంది. దీంతో ఎన్టీఆర్‌నీల్‌ సినిమా రిలీజ్‌ కాస్త వాయిదా పడుతుందెమో కానీ, ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుందని అందరూ ఊహించారు. కానీ ‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమాను ఏకంగా వచ్చే ఏడాది జూన్‌ 11కి వాయిదా వేశారు (ntr neel movie Releasedate). కానీ కొత్త రిలీజ్‌ డేట్‌ వెనక, ఎన్టీఆర్‌నీల్‌ టీమ్‌ సరికొత్త ప్లాన్‌ ఉందట.

అది ఏంటంటే…ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ చిత్రం రణ్‌వీర్‌సింగ్‌ ‘ధురంధర్‌’ సూపర్‌ డూపర్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజైంది. రెండూ భాగాలూ సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. అయితే ఈ రెండు భాగాలూ కూడా కేవలం ఆరు నెలల గ్యాప్‌లో రిలీజ్‌ అయ్యాయి.

ఇలా ఎన్టీఆర్‌నీల్‌ సినిమానూ కూడా ఆరు నెలల గ్యాప్‌లోనే రెండు భాగాలుగా రిలీజ్‌ చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. పైగా ఒక సినిమాను రెండు భాగాలుగా చేయడం అనేది ప్రశాంత్‌నీల్‌కు కొత్త ఏం కాదు. ‘కేజీఎఫ్, సలార్‌’ సినిమాలను ప్రశాంత్‌నీల్‌ ఫ్రాంచైజీస్‌లానే చేస్తున్నారు. ఇలా ‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమా కూడా ఓ ఫ్రాంచైజీలా అవతరించే అవకాశాలు లేకపోలేదు.

నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ ‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. రవిబస్రూర్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu