సెంటిమెంటా..? ప్లానింగ్గా?

Viswa
2 Min Read

Web Stories

Prabhas movie Releases: వరుస సినిమాలతో ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ‘ఫౌజి, స్పిరిట్‌’ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్‌ తీరిక లేకుండా ఉన్నారు. ఈ నెల లోనే ‘కల్కి 2’ (Kalki2) సినిమా చిత్రీకరణలో కూడా ప్రభాస్‌ పాల్గొంటారు. ఇలా ఏకకాలంలో ప్రభాస్‌ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచారు.

అయితే ఈ సినిమాల రిలీజ్‌లపై సరైన స్పష్టత అయితే ఉండటం లేదు. ‘ఫౌజి’ సినిమాను ఈ ఏడాది దసరా కు రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఇప్పుడు, ఈ సినిమా ఈ దసరాకు రిలీజ్‌ అయ్యే పరిస్థితి లేదు. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. అధికారిక అనౌన్స్‌మెంట్‌ అయితే రాలేదు. కానీ మేకర్స్‌ మాత్రం ‘ఫౌజి’ సినిమాను డిసెంబరులోనే రిలీజ్‌ చేయాలని, ఇందుకు తగ్గ ప్లానింగ్‌ ను సిద్ధం చేస్తున్నారు.

ఇక సందీప్‌వంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్‌’ (Spirit Movie) సినిమాను వచ్చే శివరాత్రికి అంటే..మార్చి 5న రిలీజ్‌ చేయను న్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించారు. కానీ.. ప్రభాస్‌ ‘ఫౌజి’ సినిమా షూటింగ్‌ను ముందు కంప్లీట్‌ చేయా లని భావిస్తున్నారట. ఈ ఎఫెక్ట్‌ ‘స్పిరిట్‌’పై పడుతోంది. సో..‘స్పిరిట్‌’ సినిమా రిలీజ్‌ కాస్త అటు, ఇటు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ‘స్పిరిట్‌’ సినిమా 2027లోనే రిలీజ్‌  (Spirit movie release)అవుతుంది.

ప్రభాస్‌ చేస్తున్న మరో సినిమా ‘కల్కి2898ఏడీ’ సీక్వెల్‌ ‘కల్కి2’. ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకుడు.

రిజల్ట్‌ గురించి పక్కన పెడితే…ప్రభాస్‌ గత చిత్రం ‘ది రాజాసాబ్‌’ సినిమా రిలీజ్‌ను తొలుత డిసెంబరులోనే ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత 2026 సంక్రాంతికి రిలీజ్‌ చేశారు. చూడబోతుంటే..ఇప్పుడు ‘ఫౌజి’ సినిమాను కూడా..మెల్లిగా 2027 సంక్రాంతికి రిలీజ్‌ అయ్యేలా ఉంది. కాకపోతే…2027 సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కానీ ఫైనల్‌గా పోటీలో నాలుగు సినిమాలే ఉండటం అనవాయితీగా వస్తోంది.
ఇలానే జరుగుతోంది. ఇలా ‘ఫౌజి’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే చాన్సెస్‌ లేకపోలేదు.

అలాగే ‘కల్కి2’ విషయంలోనూ ఇదే జరుగుతుందనిపస్తోంది. ఎందుకంటే..‘కల్కి 2’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వచ్చే డిసెంబరులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. కానీ ఆ సమయంలో చాలా హాలీవుడ్‌ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. పైగా తెలుగు ప్రేక్షకులు మెప్పు పొందిన ‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ నుంచి ‘మహావతార్‌ నరసింహా’ సినిమా కూడా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘కల్కి 2’ సినిమా డిసెంబరులో రిలీజ్‌ కాకపోవచ్చు. మెల్లిగా…2028 సంక్రాంతికి ‘కల్కి 2’ సినిమా రిలీజ్‌ కావొచ్చు.

ప్రభాస్‌ సినిమా డిసెంబరులో రిలీజ్‌ అని, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్‌ చేయడం అనేది ఒక ప్లానింగ్‌ ప్రకారం జరుగుతోందా? లేక సెంటిమెంట్‌ కోసం డిసెంబరు రిలీజ్‌ అని ప్లాన్‌ చేసుకోని, కుదరక.. .సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నారా? అనేది తెలియాలి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi