బ్రదర్స్‌కి బిగ్‌ షాక్‌!

Viswa
2 Min Read

Web Stories

Suriya and Karthi Movies were struggles to release: కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు సూర్య, ఆయన తమ్ముడు కార్తీలకు కెరీర్‌లో బ్యాడ్‌ టైమ్‌ నడుస్తు న్నట్లుగా ఉంది. కొంతకాలంగా ఓ హిట్‌ మూవీ కోసం తాపత్రయపడుతున్న సూర్య తాజా సినిమా ‘కరుప్పు’ ఈ రోజు రిలీజ్‌ కావాల్సింది. మే 14న  (Karuppu Movie Rekease date) రిలీజ్‌ కావాల్సిన ‘కరుప్పు’ (Karuppu) సినిమా రిలీజ్‌ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఆర్థికపరమైన కారణాల వల్ల ‘కరుప్పు’ సినిమా రిలీజ్‌ నిలిచిపోయిందనే టాక్‌ కోలీవుడ్‌ వినిపిస్తోంది. ఆర్‌జే బాలాజీ డైరెక్షన్‌లోని ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్‌జే బాలాజీ విలన్‌ రోల్‌ చేశారు. సూర్య, కార్తి హీరోలుగా నటించిన ఎన్నో సినిమాలను నిర్మించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ ‘కరుప్పు’ సిని మానూ నిర్మించింది. ఈ ‘కరుప్పు’ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ (Veerabhadrudu Movie release) టైటిల్‌తో రిలీజ్‌ అవుతుంది. తెలు గులో ప్రముఖ నిర్మాణసంస్థ అన్నపూర్ణస్టూడియోస్‌ ఈ ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) సినిమాను రిలీజ్‌ చేస్తుంది.

ఇక కార్తీ గత చిత్రం ‘వా వాతియార్‌’ సినిమా విషయంలోనూ ఇలానే జరిగింది. ఈ సినిమా డిసెంబరులో రేపు విడుదల అనగా, ఆర్థికపరమైన కారణాలతో, రిలీజ్‌ వాయిదా పడింది. జ్ఞానవేల్‌ రాజా నిర్మాత. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ‘వా వాతియార్‌’ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో రెండు వారాల్లోపే ‘వా వాతియార్‌’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో ఈ సినిమా ప్రజెంట్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఆసక్తికరంగా సూర్య, కార్తీలు ప్రజెంట్‌ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య చేసిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉండగా, ‘మ్యాడ్‌’ డైరెక్టర్‌ కల్యాణ్‌శంకర్‌తో కార్తి సినిమాలు సెట్స్‌పై ఉంది.

Please Share
Share This Article
225 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu