నాగచైతన్య కొత్త ప్రయాణం…నిర్మాతగా తొలి అడుగు

Viswa
1 Min Read

Web Stories

dhootha2 WebSeries : నాగచైతన్య హీరోగా నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ (dhootha2 WebSeries). విక్రమ్‌ కె.కుమార్‌ డైరెక్షన్‌ చేసిన ఈ వెబ్‌సిరీస్‌ 2023 డిసెంబరు నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్‌ సాగర్‌ పాత్రలో నాగచైతన్య నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ రెండో సీజన్‌ మొదలైంది. ఈ సిరీస్‌ పూజాకార్యక్రమాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి. నటుడు–నిర్మాత నాగార్జున ఈ సినిమా పూజాకార్యక్రమాల్లో పాల్గొని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇ చ్చారు.

తొలిసీజన్‌లో హీరోగా నటించిన నాగచైతన్య మలిసీజన్‌ ‘దూత:చాప్టర్‌ 2’ (dhootha2  OTT) లోనూ హీరోగా నటిస్తారు. కాక పోతే, ఈ సారి హీరోగా నటించడంతో పాటుగా, ఈ సిరీస్‌కు ఓ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు నాగ చైతన్య.

నిర్మాతగా నాగచైతన్యకు ఇది తొలి ప్రాజెక్ట్‌ కావడం విశేషం. శరత్‌మరార్‌ మరో నిర్మాత. విక్రమ్‌ కె. కుమార్‌ డైరెక్షన్‌లో రానున్న ఈ ‘దూత చాప్టర్‌ 2’లో పార్వతీ తిరువోతు, ప్రియాభవానీశంకర్‌ ఇతర మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేయనున్నారు. ‘దూత చాప్టర్‌ 2’  (dhootha2 Webseries)సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. త్వరలోనే ఈ సిరీస్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా ఈ ఏడాది థియేటర్స్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌వర్మ దండు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi