Irumudi Release date: రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఇరుముడి’ (irumudi hero RaviTeja) సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ ఇరుముడి సినిమాను, ఇటీవల మేకర్స్ ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. తాజాగా ఈ ఇరుముడి సినిమాను, ఆగస్టు 21న (Irumudi Release date) రిలీజ్ చేయనున్నట్లుగా రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేశారు.
రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మానవీయసంబంధాలు, కుటుంబ విలువలు, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ పాల్గొంటుండగా, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతు న్నారు. ఈ సినిమాలో అంకితభావం కలిగిన తండ్రి పాత్రలో రవితేజ నటిస్తారు. రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర, ఆయన భార్యగా ప్రియాభవానీ శంకర్ నటిస్తున్నారు.
సాయికుమార్, అజయ్‌ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.