Thamizh Murugan: హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లోని ఐదో సినిమా ప్రకటన వెల్లడైంది. ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలం’, ‘వడచెన్నై’, ‘అసురన్’ సిని మాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమాకు ‘తమిళ్ మురుగన్’ ( Thamizh Murugan) అనే టైటిల్ ఖరారైంది. లార్డ్ మురుగన్ (కుమారస్వామి) ఆధారంగా ఈ సినిమా కథనంసాగుతుంది. ఈ సినిమాను ధనుష్ తన సొంత వుండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపైనే నిర్మించబడుతుండటం విశేషం.
#Dhanush & #Vetrimaranpic.twitter.com/wAegmh7l57
— TollywoodHub (@tollywoodhub8) July 10, 2026
ఎన్టీఆర్‌కు పోటీగా….
అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటీవల ఓ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God of war Movie)అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా లార్డు కుమారస్వామి జీవితం ఆధారంగా రానుంది. ఈ సినిమాఅనౌన్స్మెంట్ పోస్టర్‌పై కుమారస్వామిని కీర్తీస్తూ శ్లోకం ఉండటమే ఇందుకు నిదర్శనం. ఇంకా ఈసినిమా చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంది.
షూటింగ్స్ ఎప్పుడు?
మరోవైపు లార్డ్ మురుగన్ తమిళ దైవం అని, తెలుగు వారు లార్డ్ మురుగన్ ఆధారంగా సినిమా చేయ డానికి వీల్లేదని కొందరు తమిళ ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. లార్డ్ మురుగన్ అందరి దేవుడని ఎవరైనా సినిమా చేయవచ్చని మరికొందరు అంటున్నారు. ఈ తరుణంలో ధనుష్వెట్రిమారన్ కాంబినేషన్లో ‘తమిళ్ మురుగన్’ సినిమా అనౌన్స్మెంట్ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సోషల్‌మీడియాలో వివాదాలకు దారితీస్తోంది.
ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ‘ఓం’ సినిమాతో ధనుష్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు పెద్ద ప్రాజెక్ట్స్. ఈ సినిమాలు కంప్లీట్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో లార్డు మురుగన్ సినిమాను ఎవరు ముందు చేస్తారు? ఎవరు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు?అన్నది కీలకంగా మారింది. మరోవైపు హీరో శింబుతో వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.