Release date: ఎట్టకేలకు ఫైనల్‌గా ‘జననాయగన్’ (Jananayagan) విడుదల తేదీ ఖరారైంది. ‘జన నాయగన్’ సినిమాను జూలై 23న (Jananayagan Release date) రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితాబైజు,ప్రియమణి, బాబీ డియోల్, గౌతమ్ వాసు దేవ్ మీనన్, ప్రకాష్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ఈ సినిమాను నిర్మించారు.
నిజానికి ‘జన నాయగన్’ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ సమస్యలు ఎదురుకావడంతో, ఈ సినిమా విడుదల నిలిచిపోయింది. ఇటీవల ఈ సినిమా సెన్సార్ పనులు ముగిశాయి. దీంతో ‘జన నాగయన్’ సినిమాను ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రంయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక రాజకీయాల్లోకి వెళ్లి, తమిళనాడు సీఎంగా ఉన్నారు దళపతి విజయ్. పైగా ‘జన నాయగన్’ సినిమా అనేది విజయ్ కెరీర్‌లో అఖరి సినిమా అనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈ సిని మాపై ఆయన అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌లోనూ విజయ్‌కి మంచి స్టార్ డమ్ ఉన్న నేపథ్యంలో ‘జన నాయగన్’ సినిమాకు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ‘జన నాయగన్’ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల అవుతుండగా, హిందీలో ‘జన నేత’ పేరుతో రిలీజ్ కానుంది. తెలుగులో ‘జన నాయకుడు’ సినిమాను ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో జనవరి 23న కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా ప్రీమియర్స్‌తో రిలీజ్ కానుంది. ఈ సినిమానూ తమిళంలోనూ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మైత్రీ సంస్థ ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఈ సంగతి ఇలా ఉంచితే…బాలకృష్ణ హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సూపర్‌హిట్‌గా నిలిచిన ‘భగవంత్‌కేసరి’ సినిమాకు తమిళ రీమేక్‌గా ‘జన నాయకుడు’ సినిమా తెరకెక్కిందనే టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోర్ పాయింట్‌ను మాత్రమే తీసుకుని, ఫైనల్ స్క్రిప్ట్‌ను చాలావరకు మార్చామని ‘జన నాయగన్’ దర్శకుడు హెచ్.వినోద్ ఓ సందర్భంగా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
The app version is so much more convenient than the browser. I can play anywhere and anytime now. Get the jiliokloginapp today.
Super easy to get into my account. The page loads fast even on my mobile data which is a huge plus for me. jilioklogin