Karikaala First Look: సోషియో ప్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం సందీప్‌కిషన్ రాబోతున్నారు. సందీప్ కిషన్ (Sundeep kishan new movie karikala) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘కరికాల’ (Karikaala Movie)అనే టైటిల్ ఖరారైంది. ఆదిసాయికుమార్‌తో ‘శంబాల’ చిత్రం చేసి, దర్శకుడిగా తన తొలి సినిమాతోనే హిట్ అందుకున్న యుగంధర్ ముని, ఈ సిని మాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘శంబాల’ సినిమాను నిర్మించిన మహిధర్ రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి అన్నభీమోజు ఈ ‘కరికాల’ సినిమానూ నిర్మిస్తు న్నారు. సందీప్‌కిషన్ కెరీర్‌లోని ఈ 33వ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు మేకర్స్. అంతేకాదు…వచ్చే ఏడాది జూలై 2న ఈ సినిమా తొలిపార్టును, ఆ ఏడాదే అక్టో బరు 28న (2027 అక్టోబరు 28)న మలిపార్టును రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత, ఇది ఏఐ జనరేటెడ్ అని సోషల్‌మీడియాలో ప్రచారం సాగింది. కానీ..కరికాల ఫస్ట్‌లుక్ ఏఐ కాదని, మేకింగ్ వీడియోను కూడా షేర్ చేస్తానని సందీప్‌కిషన్ పేర్కొన్నారు. అలాగే…ఈ సినిమాను గురించి..తాను చేప్పేది ఏమీ లేదని…సినిమానే మాట్లాడుతుందని సందీప్‌కిషన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న హీరో సందీప్‌కిషన్‌కు ‘మాజాకా’ సినిమా కాస్త ఊరట అందించింది. మరోవైపు…తమిళనాడు సీఎం దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘సిగ్మా’. ఈ చిత్రంలో సందీప్‌కిషన్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటిం చారు. ఈ సినిమాను జూలై 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రిలీజ్‌ను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.
