Lokesh Kanagaraj DC Review: దర్శకుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా, ‘ఖైది, విక్రమ్, లియో, మాస్టర్, మా నగరం’వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). నిర్మాతగానూ జీ స్క్వాడ్ అనే సంస్థను స్థాపించి, సినిమాలను నిర్మిస్తున్నారు లోకేష్ కనగరాజ్. తాజా లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. లోకేష్ హీరోగా నటించిన ‘డీసీ’ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ (DC Movie Director Arun Matheswaran) దర్వకత్వం వహిం చారు. మరి..లోకేష్ కనగరాజ్ యాక్టర్‌గా మెప్పించాడా? అరుణ్మాథేశ్వరన్ మ్యూజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా? రివ్యూలో చూసేద్దాం.
సినిమా: డీసీ (Lokesh Kanagaraj DC Review)
ప్రధాన తారాగణం: లోకేష్ కనగరాజ్, వామికాగబ్బి, సంజనా కృష్ణమూర్తి
దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాత: సన్‌పిక్చర్స్, కళానిధిమారన్
మ్యూజిక్: అనిరు«ద్ రవించదర్
కెమెరా: ముఖేష్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
నిడివి: 2 గంటల 22 నిమిషాలు
విడుదల తేదీ: ఆగస్టు 7, 2026
రేటింగ్:3/5 (DC movie review and rating)
కథ
సర్కార్ గ్యాంగ్‌లో దేవదాస్ (లోకేష్ కనగరాజ్) ఓ గ్యాంగ్‌స్టర్. పోలీస్‌లపై దాడి చేసి, కొత్తగా వచ్చిన తుపాకులను దొంగిలిస్తారు సర్కార్ గ్యాంగ్. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్‌ను చంపేస్తారు. దీంతో సర్కార్ గ్యాంగ్‌ను టార్గెట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పోలీసులకు దొరక్కుండ మరో ప్రాం తానికి వెళ్తారు సర్కార్ గ్యాంగ్. అక్కడ ఓ హోటల్లో దేవదాస్‌కు వేశ్వ అయిన పార్వతి (సంజనా కృష్ణ మూర్తి) పరిచయం అవుతుంది. దేవదాస్ ఆమెను ఇష్టపడతాడు. కానీ..సర్కార్ గ్యాంగ్‌పై పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో పార్వతి చనిపోయింది. దేవదాస్ తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఇంకో ప్లేస్‌లో దేవదాస్‌కు మరో వేశ్య చంద్ర (వామికా గబ్బి) పరిచయం అవుతుంది. చంద్ర తన బాధను దేవదాస్‌తో పంచు కుంటుంది. ఈ వేశ్యగృహం నుంచి చంద్రను తప్పించాలని దేవదాస్ అనుకుంటాడు. కానీ మళ్లీ సర్కా ర్ గ్యాంగ్‌పై పోలీసులు దాడి చేస్తారు. గ్యాంగ్ లీడర్ సర్కార్‌తో పాటుగా, గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులు చనిపోతారు. మరి.. పోలీసుల పై దేవదాస్ అండ్ టీమ్ఏ విధంగా పగ తీర్చుకున్నారు? డబ్బు కోసం దేవదాస్ తాపత్రయం ఎందుకు? అసలు..దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు? అన్నది మిగిలిన కథాంశం.
టూత్ బ్రెష్ కొనివ్వలేదని…తండ్రిపై కొడుకు కేసు…
విశ్లేషణ
ఒక మనిషి భావోద్వేగాలను ఇంటెన్స్ యాక్షన్‌తో తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయానికి తెగబెడ్డప్పుడు, వారిపై తిరుగుబాటు చేసిన ఓ చదువుకున్న వ్యక్తి ప్రయాణమే ఈ సినిమాగా చెప్పుకోవచ్చు. కేవలం ఇదొక యాక్షన్ సినిమాయే కాదు..ఇందులో ఓ వేశ్యల సాధాకబాధకాలు, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, చిన్నపాటి సందేశం ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఇంట్రవెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ సిడ్రోమ్ ఏమైనా ఉంటుందా? అనే సందేహం లేదు. సెకండాఫ్ కూడా ఫర్వాలేదనిపిస్తోంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా బాగున్నాయి.
కథ విషయంలో మొదట్లో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉన్నా, అసలు స్టోరీ స్టారై్టన తర్వాత, కథ వేగం పుంజు కుంటుంది. ఆడియన్స్‌ను కథలో లీనం చేస్తుంది. కానీ స్టోరీ లైన్లో పెద్ద కాంప్లెక్స్సిటీ లేదు. సింపుల్ లైన్. కానీ ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అనిరు«ద్ ఆర్ఆర్ అదిరిపోయింది. మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు కనిపిస్తాయి. అందుకే సెన్సార్ వారు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్, వేశ్యగృహం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. మాస్ ఆడియన్స్ మెచ్చే సూపర్భ్ మెటిరీయల్ ఉన్న సినిమా ఇది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్
దర్శకుడుగా లోకేష్ కనగరాజ్ ఎంత సక్సెస్ అయ్యారో, నటుడిగానూ ఆ పెర్ఫార్మెన్స్నే వెండితెరపై చూపించారు. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ లేకపోయినా, ఎక్స్‌ప్రెషన్స్‌తో పాస్ అయిపోయారు. యాక్టర్‌గా లోకేష్కనగరాజ్ కెరీర్‌కు ఏ మాత్రం డోకా లేదని, సర్టిఫికేట్ ఇచ్చే సినిమా ఇది. ఉన్నంతో పార్వతిగా సంజనా కృష్ణమూర్తి మంచి నటనే కనబరచారు. ఎమోషనల్ ఎండ్ ఉంటుంది. ఇక చంద్ర పాత్రలో తెరపై మరో కొత్త వామికాను చూస్తారు ఆడియన్స్. చంద్ర పాత్రలో వామిక తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్‌లో ఆమె నటన, యాక్షన్ ఈజ్ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి.
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ..కొరియన్ దెయ్యంతో రూ. 3 కోట్ల డీల్ ఏమైంది?.
ఇక ఈ సినిమాకు అనిరు«ద్ మ్యూజిక్, ఆర్ఆర్ మేజర్ హైలైట్. చాలా సీన్స్‌లో మ్యూజిక్‌నే కథను ముందుకు నడిపినట్లుంటుంది. ఒకరకంగా ఈ సినిమాకు అనిరు«ద్ రవించదర్ మరో హీరో అని చెప్పవచ్చు. ముకేష్ విజువల్స్, ప్రసన్న ఎడిటింగ్ ఒకే. ప్రముఖ నిర్మాణసంస్థ అయిన సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మాణ విలువలు బాగు న్నాయి.
ఫైనల్‌గా….
మాస్ మూమెంట్స్ ఆడియన్స్‌ను మెప్పించగలిగే మెటిరీయల్ ఉన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా ఇది. స్టోరీ సింపుల్‌గా ఉన్నా, కథలో ఎమోషన్స్, వీటికి తోడైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ను థియేటర్స్‌లో కూర్చొబెడతాయి.
Finally found a platform that doesn’t lag during peak hours. The login process is smooth and the interface is very user friendly. Give hoki69login a try if you want a hassle free game.
I’ve been playing on this app for a few weeks now and the interface is super smooth. The payouts are surprisingly fast too. Highly recommend j8jiliapp for anyone looking for a reliable spot.
Finally found a platform that doesn’t lag during peak hours. The customer support is helpful too. I’m sticking with pklucky53 for a long time.
[9473]bd99 Login Malaysia | Daftar Akaun Slot Online Trusted TPG,bd99 menawarkan akses mudah untuk casino deposit touch n go dan cara main baccarat online yang ringkas. Jom daftar akaun bd99 sekarang untuk mula bermain. visit: bd99