భావోద్వేగాల ఇరుముడి…!

Kumar NA
1 Min Read
Raviteja Irumudi Movie Trailer Released

Web Stories

Raviteja 𝗜𝗿𝘂𝗺𝘂𝗱𝗶 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗧𝗿𝗮𝗶𝗹𝗲𝗿: రవితేజ (Raviteja) హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’ (Irumudi Movie). ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్, రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న (Irumudi movie release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ నేపథ్యంతో ఈ సినిమా సాగుతుందని ఈ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. అలాగే డివైన్, థ్రిల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మద్యానికి బానిసైన హీరో, భార్యాకుమార్తెల కోస అయ్యప్పమాల స్వీకరించడం, ఆ తర్వాత జరిగే కొన్ని థ్రిల్లింగ్‌ అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘నాకో బలహీనత ఉంది.. ఏ ఆడకూతుర్లో అయినా..నా కూతుర్ని చూసు కునే అరుదైన బలహీనత’ అంటూ రవితేజ మాస్‌ టోన్‌తో చెప్తున్న డైలాగ్‌ ఈ సినిమాలో ఉంది. దీంతో ఈ సినిమాలో భావోద్వేగాలు కూడా మెండుగానే ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

‘‘ఇరుముడి’ అంటే ఇద్దరికీ పడిన ముడి..ఒక తండ్రికి–కుమార్తెకు మధ్య ఉన్న ముడి, అయ్యప్పస్వామికి ఆయన భక్తుడికి మధ్య ఉన్న ముడి. అలాగే ఈ సినిమాలో ఒక చిన్న క్రైమ్‌ చిక్కుముడి కూడా ఉంది’’ అంటూ ఈ ‘ఇరుముడి’ సినిమాను గురించి చెప్పారు దర్శకుడు శివ నిర్వాణ. గురుస్వామి పాత్రలో సాయికుమార్, విలన్‌గా అజయ్‌ఘోస్, స్వాసిక ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్‌ ఇందిర, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu