హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి అనేక ప్రాంతాలలో ఈ సంవత్సరం గణపతి నవరాత్రుల ఉత్సవ సందర్భంగా ప్రముఖ రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం సంస్థాపక కార్యదర్శి, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదు.
వినాయక చతుర్థికి ముందుగానే అందిన ఈ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ గ్రంధం చాలా చాలా బాగుందని, కంటెంట్ అండ్ కటౌట్ రెండూ చాలా చాలా బాగున్నాయని, మంగళప్రదమైన, పరమాద్భుతమైన అరుదైన గణపతి వర్ణ చిత్రాలు ఎంతో ఎంతో ఆకర్షిస్తున్నాయని సాక్షాత్తూ తెలంగాణా సెక్రటరియేట్లోని ఎంతో మంది అధికార, అనధికారులు పురాణపండ శ్రీనివాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంతో పాటు ఆదిశంకరాచార్యుల, ప్రాచీన ఋషుల కొన్ని ముఖ్య స్తోత్రాలకు పురాణపండ అందించిన కామెంటరీ ఎంతో సౌందర్యవంతమైన భాషతో భక్త పాఠకుల్ని ఆకర్షిస్తోందనేది అన్ని ప్రాంతాలలో వినిపిస్తున్న సత్యం.
ఏ ఫోర్ సైజులో జపాన్ ఆర్ట్ పేపర్ పై విశేషంగా ఆకర్షించేలా డిజిటల్ ప్రింటింగుతో రూపుదిద్దుకున్న ఈ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ గ్రంధం హైదరాబాద్లో వందల కొలది కాలనీలకు చేరడంతో ఈ వినాయక చవితి స్పెషల్గా పురాణపండ శ్రీనివాస్ పతాకంపై రెపరెపలాడుతున్నారనేది సత్యం.

తెలుగుదేశం కార్యాలయం, రవీంద్రభారతి, రాజపుష్ప, మైహోం, మైహోం అవతార్, అపర్ణ, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్ బడా గణేష్, కూకట్ పల్లి, మణికొండ, గచ్చిబౌలి తదితరప్రాంతాలలో వేల వేల కొలది భక్తుల చేతుల్లో ఇప్పుడే ఈ పుస్తకం హడావిడి కనిపించడం మీడియా కంటబడింది.
ఎన్ని కష్టాలెదురైనా దైవబలంతో ఎదుర్కొంటూ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న పురాణపండ శ్రీనివాస్ ఈ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ పుస్తకం ఈ గణేశ నవరాత్రులలో జంటనగరాలలో సంచలనమేనని ముందుగానే చెప్పాలి.
ఒక వైపు కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీమంత్రి బొల్లినేని కృష్ణయ్య, మరో వైపు వారాహి చలనచిత్రం అధినేత, శ్రీ అమృతేశ్వర ఆలయం ఫౌండర్ చైర్మన్ సాయి కొర్రపాటి తదితర ప్రముఖుల సమరంతో అందిన ఈ మంగళ మంత్రం పేటిక సుమారు వందపేజీలతో అనేక మంత్ర తంత్ర యంత్రాత్మక విశేషాలతో వైదిక బద్దంగా, శృతి గౌరవంగా భక్త పాఠకులకు రచనా సంకలనంగా అందించడం పురాణపండ పవిత్రంగా క్రొత్త పుంతలు త్రొక్కించారనే చెప్పాలి.
ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే శ్రీనివాస్ బుక్స్ కి, శైలికి లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారనేది కఠినమైన సత్యం. వారందరి పాలిట ఇది మహా గణపతి అనుగ్రహంగా అందిన అక్షర కల్ప వృక్షమేనని చెప్పాల్సిందేనని విజ్ఞుల అభిప్రాయం.
Tags:
Puranapanda Srinivas, Sai Korrapati, Bollineni Krishnaiah, Gnana Maha Yagnakendram, Khairathabad Ganesh 2026, Gouriputra Namastestu