M.S Subbulakshmi Biopic: సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ (M.S Subbulakshmi Biopic) వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ‘ఎం.ఎస్– ఎ లెగసీ ఆన్‌స్క్రీన్’ (M.S- A Legacy On Screen) టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (M.S Subbulakshmi Biopic Director Gowtham Tinnanuri) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, అల్లు అర వింద్, రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తు న్నారు. వెండితెరపై ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్నారు. బుధవారం (సెప్టెంబరు 17)న ఎం.ఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ‘ఎం.ఎస్– ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ సినిమాను చెన్నైలో అధికారికంగా లాంచ్ చేశారు. ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత కమల్ హాసన్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరై, తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.
అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ–‘‘ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగారి సంగీతమే మనందరికీ సందేశం అని చెప్పారు. ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగారి బయోపిక్‌లో నటించేందుకు గర్వంగా, గౌరవంగా ఉందని రష్మికా మందన్నా తెలిసారు. ఈ బయోపిక్ శక్తివంచన లేకుండ కృషి చేస్తానని రష్మిక చెప్పారు. ఎం.ఎస్ సుబ్బు లక్ష్మిగారి జీవిత విషయాలను తెలుసుకున్న తర్వాత, ఈ బయోపిక్ నిర్మించాలన్న ఆసక్తి మరింత పెరి గిందని తెలిపారు అల్లు అరవింద్. బన్నీవాసు, గౌతమ్‌తిన్ననూరి తదితరులు మాట్లాడారు.