Meghamsh Srihari Aasmaan Teaser: ‘మీరు ఇప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోకచిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు. అదే నిజం..’ అనే సంభాషణలతో ప్రారంభం అవుతుంది ‘ఆస్మాన్’ సినిమా టీజర్. దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి (Meghamsh Srihari) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆస్మాన్’ (Aasmaan). రాయంచ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ సినిమాను నిర్మి స్తున్నారు. సెప్టెంబరు 16న మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆస్మాన్’ సినిమా టీజర్ (Meghamsh Srihari Aasmaan Teaser) లాంచ్ ఈవెంట్‌ను హైదరా బాద్‌లో నిర్వహించారు మేకర్స్.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఆస్మాన్ సినిమా టీజర్ తనకు నచ్చిందని, తన తమ్ముడు మేఘాంశ్‌ను తాను ఎలాంటి పాత్రలో చూడలను కున్నానో, ఆ తరహా పాత్రలోనే మేఘాంశ్ కనిపించారని అన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, అరబిక్ భాషల్లో ‘ఆస్మాన్’ సినిమా రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.