Meghamsh Srihari Aasmaan FirstLook: దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆస్మాన్’ (Aasmaan Firs tLook). రామ్‌నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, అరబిక్ భాషల్లో రూపొం దుతోంది. ఆగస్టు 15న శ్రీహరి జయంతి సందర్భంగా ‘ఆస్మాన్’ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వెంకటేశ్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ‘ఆస్మాన్’ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఆస్మాన్ మోషన్‌పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో శాంతి శ్రీహరి మాట్లాడుతూ– ‘‘రియల్‌స్టార్ శ్రీహరి మాదిరిగానే మేఘాంశ్ కూడా కష్టపడుతున్నాడు. నా కంటికి ఎప్పుడూ చిన్నపిల్లాడిలా కనిపించే మేఘాంశ్, ‘ఆస్మాన్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో మాత్రం సింహాంలా కనిపిస్తున్నాడు’’ అని చెప్పారు.
మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ–‘‘ఆస్మాన్’ సినిమా సెట్స్‌లో ఎప్పుడూ పండగ వాతావరణం నెలకొని ఉండేది. దర్శకుడు రామ్‌నందన్‌తో వర్క్ చేయడం గొప్ప అనుభూతి. త్వరలోనే ఈ సినిమాను గురించి, మరిన్ని వివరాలను తెలియజేస్తాను’’ అని తెలిపారు.

‘‘ఆస్మాన్’ సినిమా ఆడియన్స్‌కు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా ఉంటుంది’’ అని పేర్కొన్నారు రామ్‌నందన్.
‘‘ఈ సినిమా కోసం మేఘాంశ్ అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. రియల్‌స్టార్ కొడుకు అంటే ఎలా కష్టపడతాడో అలానే చేస్తున్నారు మేఘాంశ్. మాకు సపోర్ట్ చేస్తున్న శాంతిశ్రీహరిగారికి ధన్యవాదాలు’’
అని తెలిపారు నిర్మాత వెంకటేశ్
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రాయంచ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్.విహరి, కెమెరామ్యాన్ షోయబ్, నటుడు రవివర్మ మాట్లాడారు.
If you are looking for a professional casino experience from home this is it. The graphics are top notch and the gameplay is fair. Visit betpkonlinecasino today.