తెలుగులోకి హనుమాన్‌ అంశ్‌…ట్రైలర్‌ చూశారా?

Viswa
1 Min Read
Hanuman Ansh Telugu Trailer Released

Web Stories

Hanuman Ansh Telugu Trailer: నార్త్‌లో హిందీ సినిమా ‘హనుమాన్‌ అంశ్‌’ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సంచలనమే సృష్టించింది. రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వసూలు చేసి, ఇంకా ప్రదర్శిం చబడుతోంది. ఇప్పుడు ఈ ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా తెలుగులో రిలీజ్‌ కానుంది. ఈ అక్టోబరు 9న ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ‘కాంతారా, సలార్, కేజీఎఫ్, మహావతార్‌ నరసింహా’ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ ఈ ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. దర్శక–నిర్మాత త్రివిక్రమ్‌ ముందుగా ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమాను తెలుగులో సెప్టెంబరు 18న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో, అక్టోబరు 9న హోంబలే ఫిల్మ్స్‌ ఈ సినిమాను తెలుగు లో రిలీజ్‌ చేస్తోంది. ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమాను ఓవర్‌సీస్‌లో కూడా హోంబలేఫిల్మ్స్‌ వారే డిస్ట్రిబ్యూట్‌ చేశారు. లేటేస్ట్‌గా ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఓటీటీలో మండాడి మూవీ…మిత్రులే శత్రువులు అయితే….

 

‘హనుమాన్‌ అంశ్‌’ సినిమాకు విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించగా, నీమ్‌ కరోలిబాబాగా శోభినావ్‌ సత్యా నటించారు. చందన్‌ ఆనంద్, పూర్ణిమా తివారీ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

 

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu