గ్రూపులుగా నాపై నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు: విజయ్‌ దేవరకొండ

Viswa
2 Min Read

Web Stories

Ranabaali Telugu Trailer: సినిమా పరిశ్రమలో తనపై టార్గెటెడ్‌గా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు తనకు ఏడేళ్ల సమయం పట్టిందని వాపోయారు హీరో విజయ్‌ దేవరకొండ. రణబాలి సినిమా చూడకుండ, ‘జైలర్‌ 2’ సినిమాను చూద్దామని అన్నట్లుగా కొంతమంది కావాలనే సోషల్‌మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారని, ఒకే సారి దాదాపు 50 సోషల్‌మీడియా అకౌంట్స్‌ నుంచి ఒకే విధమైన నెగటివ్‌ పోస్టులు సోషల్‌మీడియాలో వచ్చాయని ఆరోపించారు విజయ్‌. ఇలా తనను వెనక్కి లాగేవాళ్లు, వారి జీవితాలను బాగుపడేలా చేసుకుంటే మంచిదని చరకలు విజయ్‌ దేవరకొండ అట్టించారు.

‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. 19వ శతాబ్ధంలో రాయలసీమలో బ్రిటీష్‌ పరిపాలన ఉన్న సమయంలో భారతీయులు ఎదుర్కొన్న కరువు, ఆకలి చావుల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ‘రణబాలి’ సినిమా అక్టోబరు 16న (Ranabaali Release date) విడుదల కా నుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా యూనిట్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెం ట్‌ను నిర్వహించారు.

VijayDevaraKonda Ranabaali Movie Trailer launched Event2
VijayDevaraKonda Ranabaali Movie Trailer launched Event28

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘‘రణబాలి’ సినిమా తనకు, తన భార్య రష్మికల ఫిల్మోగ్రఫీలో గొప్ప చిత్రంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. రాహుల్‌ మళ్లీ ఇలాంటి కథను రాస్తారో లేదో తెలియదు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాం. రణబాలి సినిమా ఒక యుద్ధంలా ఉంటుంది’’ అని చెప్పారు రాహుల్‌ సాంకృత్యాన్‌. ‘‘రణబాలి’ సినిమావంటి కథలు చాలా అరుదుగా వస్తాయి’’ అని చెప్పారు నిర్మాత నవీన్‌ ఎర్నేని. ‘‘విజయ్‌ దేవర కొండకు సినిమాలే లోకం. ఆయనపై నెగిటివిటీ మానుకోవాలని కోరుతున్నాను. రణబాలి’ సినిమా విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు వై. రవిశంకర్‌.

Please Share
Share This Article
2 Comments
  • I would like to thnkx for the efforts you have put in writing this blog. I am hoping the same high-grade blog post from you in the upcoming as well. In fact your creative writing abilities has inspired me to get my own blog now. Really the blogging is spreading its wings quickly. Your write up is a good example of it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu