సడన్‌గా ఇండియన్‌ 3…ఎవరికి లాభం?

Viswa
1 Min Read
KamalHasaan Indian3 Movie News

Web Stories

Indian3 Release: కమల్‌హాసన్‌ (kamalhaasan news) హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (indian Movie) (తెలుగులో ‘భార తీయుడు’) సినిమా 1996లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్‌ 2’ను ప్రకటించారు దర్శకుడు శంకర్‌. కానీ 2024లో విడుదలైన ‘ఇండియన్‌ 2’ సినిమా కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే ఒక పెద్ద ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. ఇటు శంకర్‌ను కూడా అవుట్‌డేటేడ్‌ డైరెక్టర్‌ను చేసింది.

ఇప్పుడు ‘ఇండియన్‌ 3’ సినిమా (indian3 Movie) రాబోతుంది. ‘ఇండియన్‌’, ‘ఇండియన్‌ 2’ చిత్రాల్లో సేనాపతిగా కమల్‌ హాసన్‌ పాత్రను చూశాం. అయితే ‘ఇండియన్‌ 3’లో ఉండేది మాత్రం..సేనాపతి తండ్రి పాత్ర. ఒకరకంగా..
భారతదేశానికి స్వాతంత్వ్య్రం పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంతో, తన తండ్రి నుంచి సేనాపతి ఎలాంటి స్ఫూర్తిని పోందారు? అనే అంశాలను ఈ సినిమాలో చూడబోతున్నారట ప్రేక్షకులు. నిలిచిపోయిం దనుకున్న ‘ఇండియన్‌ 3’ సినిమా సడన్‌గా ఇప్పుడు ట్రాక్‌లో వచ్చింది. త్వరలోనే బ్యాలెన్స్‌ చిత్రీకరణను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మరి..ఇండియన్‌ 3 సినిమా దర్శకుడు శంకర్‌కు హెల్ప్‌ అవుతుందా? లేక లైకా ప్రొడక్షన్స్‌కు డబ్బులు తెస్తుందా? పోనీ..కమల్‌ హాసన్‌కు మరో హిట్‌ ఇస్తుందా? అనేది చూడాలి.

ఇండియన్‌ 3 సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ సింహా, ప్రియాభవానీశంకర్, సిద్దార్థ్, ఎస్‌జే సూర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరు«ద్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu