Bhaja Govindam Song: ‘రియాలిటీ’ సినిమా నుంచి వచ్చిన ‘భజగోవిందం’ ( Bhaja Govindam Song) పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ‘‘భజ గోవిందం భజగోవిందం బ్రతుకే కోలాహలం..భజ భజ గోవిందం బరువేకాదేక్షణం’ అంటూ మొదలవుతుంది ఈ పాట. సనారే అందించిన లిరిక్స్ ఈ పాటకు బాగా ఫ్లస్ అయ్యాయి. అలాగే వైకోమ్ విజయలక్ష్మి గాత్రం ఈ సినిమాకు మరో మేజర్ ఏట్రాక్షన్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను స్వరప రచారు. ‘ఉన్నంతలో మనకున్నంతో బతికితే అదే సుఖము..ఎవరికి తలొంచక నీవు నీ కాళ్ళపై నిలబడే గుణం వరము..’ అంటూ ఈ పాట లిరిక్స్ సాగుతాయి.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, కథ–స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా, తొలిసారి దర్శకత్వం వహి స్తున్న ఈ రియాలిటీ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ హోటల్ రన్ చేసే ఆనందం పాత్రలో కిరణ్ అబ్బవరం, ఆలోచన రోల్లో దేవికాభట్ నటించారు. శరత్ కుమార్, సాయికుమార్, రోహిణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు. జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మించారు. సురేష్ యెర్రా ఈ సినిమాకు సహ–నిర్మాత.

మరోవైపు బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’ సినిమాలు కూడా క్రిస్మస్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న నేపథ్యంతో డిసెంబరు 25న రిలీజ్ కానున్న ‘రియాలిటీ’ సినిమా ఆడియన్స్‌ను ఎంతమేరకు థియేటర్స్‌కు రప్పించగలుగుతుంది, ఈ బాక్సాఫీస్ పోటీలో ఏ మేర సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.
Thanks for sharing this overview. It is worth reviewing the price, shipping terms, and return policy carefully. I will use this as a starting point for further research.
Helpful summary of the topic. I would look for reliable evidence before relying on any supplement claims. I will use this as a starting point for further research.
This explanation is easy to follow. It is a good idea to make an informed decision rather than relying on advertising alone. A balanced explanation like this is useful.