Suriya Scene Movie Review: సూపర్‌హిట్ సినిమాలు ‘కరుప్పు (వీరభద్రుడు)’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత సూర్య హీరోగా చేసిన ‘సీన్’ (Scene movie review) సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. ‘ఆవేశం’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న మలయాళ దర్శకుడు జీతూ మోహన్‌దాస్ ఈ సిని మాను తెరకెక్కించాడు. మరి..‘సీన్’ సినిమాతో సూర్యకు హ్యాట్రిక్ లభిం చిందా? ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో (Scene Movie Review) చది వేద్దాం.
కథ
క్రైమ్‌బ్రాంచ్‌లో డీఎస్పీ ప్రేమ్‌రాజ్ (సూర్య) క్రైమ్స్పాట్ లోపలికి వెళ్లి చూడకుండానే జస్ట్ పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చదివి కేసులు సాల్వ్ చేస్తుంటాడు. ప్రేమ్‌రాజ్‌కు అంతటి టాలెంట్ ఉంది. ఏడు హత్యలు చేసిన పెర్ఫ్యూమ్ సీరియల్ కిల్లర్ విక్టర్ (టోవినోథామస్)ను అరెస్ట్ చేసి, జైల్లో వేస్తాడు ప్రేమ్‌రాజ్. కానీ విక్టర్ జైల్లో ఉండగానే…విక్టర్ స్టైల్ తరహాలోనే మరో మర్డర్ జరుగుతుంది. విక్టర్ జైల్లో ఉంటే మరి..ఈ హత్య చేసింది ఎవరు? ప్రేమ్‌రాజ్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్కు తెలిసిన షాకింగ్ విషయం ఏంటి? ప్రేమ్‌రాజ్ తన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశాడు? ప్రేమ్‌రాజ్‌ను సైకో కాంట్రాక్ట్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లేన్) ఎందుకు చంపాలనుకున్నాడు? ప్రేమ్‌రాజ్ జీవితంలో మాయ (నజ్రియా) ఎవరు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించాడంటే అందరికీ ‘సింగమ్’ సినిమాలే గుర్తుకు వస్తాయి. యాంగ్రీ పోలీస్ మ్యాన్‌గా ఈ తరం ఆడియన్స్ గుర్తుపెట్టుకున్న వారిలో సూర్య ముందు వరుసలో ఉంటాడు. అలాంటి సూర్య ‘సీన్’ సినిమాకోసం మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడంటే ఈ సినిమాపై అంచనాలు ఉంటాయి. అయితే దర్శకుడు జీతూ మాధవన్ కాస్త విభిన్నంగా ఆలోచించాడు. సూర్యతో సింగమ్ వంటి మరో మాస్ కమర్షియల్ సినిమాను తీయకుండ, ఓ డిఫరెంట్ మూవీ చేశాడు. జీతూ మాధవన్‌ను నమ్మి సూర్య ఈ ప్రేమ్‌రాజ్ రోల్ చేయడం కూడా ఒకింత రిస్క్ అని కూడ చెప్పవచ్చు.

ప్రేమ్‌రాజ్ క్యారెక్టరైజేషన్‌ను గురించిన సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రేమ్‌రాజ్ కేసులను సాల్వ్ చేయడం, ప్రేమ్‌రాజ్ గురించి ఓ షాకింగ్ నిజం తెలియడం వంటి సన్నివేశాలతో ఫస్ట్‌హాఫ్ సాగుతుంది. ఎప్పుడైతే మాయ ప్రేమ్‌రాజ్ జీవితంలోకి వస్తుందో,అప్పట్నుంచి కథ మరింత వేగం పుంజుకుంటుంది. మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్‌ను ఒక్కోమెట్టుగా ప్రేమ్‌రాజ్ సాల్వ్ చేస్తున్న సన్నివేశాలతో సెకండాఫ్ స్టోరీ ముందుకు వెళ్తుంటుంది. ఈ మధ్యలో ప్రేమ్‌రాజ్, మాయల మధ్య ఉన్న లవ్‌ట్రాక్ కాస్త ఇబ్బందిగా ఉన్నా, బోర్ కొట్టదు. ఇందుకు కారణం మరోవైపు ప్రేమ్‌రాజ్, ఈశ్వరన్‌కు మధ్య జరుగుతున్న మైండ్‌గేమ్‌తో ఇది లింకప్‌పై ఉండటమే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సెటప్ బాగున్నాయి.
రామాయణం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఎవరు ఎలా చేశారు
ప్రేమ్‌రాజ్ పాత్రను సూర్య చేయడమే ఓ డేరింగ్ డెసిషన్. ప్రేమ్‌రాజ్‌గా సూర్య చక్కగా నటించాడు. తనలోని మరో కామెడీ యాక్టర్‌ను మరోసారి బయటకు తీసుకువచ్చే అవకాశం ఈ ‘సీన్’ చిత్రంతో సూర్యకు కుదిరింది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు సూర్య. ఏ మాత్రం హీరోయిజం జోలికి పోకుండ ప్రేమ్‌రాజ్ పాత్రకు కట్టుబడి ఉంటడం బాగుంది. ఒక మాయ పాత్రలో నజ్రియా యాక్టింగ్ భలేగా ఉంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. క్రైమ్‌బ్రాంచ్ హెడ్ స్టీఫెన్‌గా లాల్, ఆనంద్‌రాజ్, గజరాజ్, రాజ్ప్రియన్ వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు. ఈశ్వరన్ పాత్రలో నస్లేన్ కూల్‌గా యాక్ట్ చేశాడు. కానీ చిన్నపాటి యాక్షన్ సీక్వెన్స్‌లో తేలిపోయాడు. టోవినోథామస్, జ్యోతికలు గెస్ట్ రోల్స్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చాయి.

ఈ సీన్ సినిమాలోని ప్రతి మెయిన్ క్యారెక్టర్‌కు ఏదో ఒకలోపం పెట్టి, ఓ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాను డార్క్ కామెడీ జానర్లో దర్శకుడు జీతూ జోసెఫ్ ఎక్స్‌ఫ్లోర్ చేయడం బాగుంది. మళ్లీ ఇందులో సైకో థింగ్స్. ఇది ఓ డిఫరెంట్ అటెంమ్ట్ అని చెప్పవచ్చు. దర్శకుడుగా జీతూమాధవన్ తన సిగ్నేచర్, ప్రతిభను వెండి తెరపై చూపించాడు. అయితే హీరో పాత్ర తాలుకూ బ్యాగ్డ్రాప్ స్టోరీని వదిలేశాడు. బాహుశా..పార్ట్ 2 కోసం ఇది ఓ ఎత్తుగడ కావొచ్చు. అందుకే విక్టర్ ఎలా అరెస్ట్ అయ్యాడో పూర్తిస్థాయిలో చూపించలేదు కాబోలు. సుశిన్ శ్యామ్ మ్యూజిక్, వినీత్ అగస్త్యన్ కెమెరా వర్క్ బాగున్నాయి. సూర్య–జ్యోతికల నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
రేటింగ్ 2.75/5