ముగ్గురు దర్శకులు మారిపోయారు…!

Viswa
1 Min Read

Web Stories

Thalaivar 173 Gets Third Director in 6 Months: ఏ సినిమాకు జరగన్నీ టర్న్స్‌ అండ్‌ ట్విస్ట్స్‌ ప్రజెంట్‌ రజనీకాంత్‌ సినిమాకు జరుగుతున్నాయనిపిస్తున్నారు. ఎందుకంటే..రజనీకాంత్‌ 173వ సినిమాకు (Thalaivar 173) ఇప్పటికే ముగ్గురు డైరెక్టర్స్‌ మారారు. తొలుత ఈ సినిమాకు లోకేష్‌ కనగరాజన్‌ పేరు వినిపించింది. అయితే కమల్‌హాసన్, రజనీకాంత్‌గార్లు తననొక మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ స్టోరీని రెడీ చేయమంటే..తాను మాత్రం ఓ యాక్షన్‌ స్టోరీ సిద్ధం చేశానని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నానని, దర్శకుడు లోకేష్‌నే స్వయంగా చెప్పారు.

ఆ తర్వాత రజనీకాంత్‌ 173వ సినిమాను డైరెక్ట్‌ చేయడానికి దర్శకుడు సుందర్‌.సి వచ్చారు. రజనీకాంత్‌తో గతంలో అరుణాచలం వంటి సూపర్‌హిట్‌ తీసింది ఈ దర్శకుడే. కానీ సడన్‌గా…రజనీకాంత్‌ 173వ సినిమా నుంచి సుందర్‌.సి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. కారణాలు తెలియరాలేదు.

ఆ తర్వాత రజనీకాంత్‌ 173వ సినిమాకు సిబీ చక్రవర్తి లైన్లోకి వచ్చాడు. శివకార్తీకేయన్‌తో ‘డాన్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తీసిన యంగ్‌ డైరెక్టర్‌ ఇతను. రజనీకాంత్‌తో సినిమా అనగానే..హ్యాపీ ఫీలైయ్యాడు. కానీ.. ఇంతలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి, సీబీ చక్రవర్తి కూడా తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

మరి…ప్రజెంట్‌ రజనీకాంత్‌ 173వ సినిమాకు దర్శకుడు ఎవరు అంటే…ప్రజెంట్‌ కోలీవుడ్‌లో అశ్వత్‌ మారిముత్తు పేరు వినిపిస్తోంది. ‘ఓ మై కడవులే’ (తెలుగులో ఓరి..దేవుడా..గా రీమేక్‌ కాబడింది). ఇప్పటికే ముగ్గురు దర్శకులు మారారు. మరి..ఫైనల్‌గా…అశ్వత్‌ అయినా కన్ఫార్మ్‌ అవుతారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఈ సినిమాను కమల్‌హాసన్, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఇంకా షూటింగ్‌ప్రారంభం కానీ నేపథ్యంలో…ఈ సినిమాకు వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందా? అనే విషయంపై సందిగ్దత నెలకొని ఉంది.

Please Share
Share This Article
1 Comment
  • Алкогольная зависимость — это не просто вредная привычка, а серьёзное заболевание, которое разрушает здоровье, психологическое состояние, семейные и рабочие отношения. Когда силы для самостоятельной борьбы на исходе, а традиционные методы не дают результата, современное кодирование становится эффективным решением для возвращения к трезвой жизни. В наркологической клинике «Новый Путь» в Электростали применяется весь спектр современных методик кодирования — с гарантией анонимности, профессиональным подходом и поддержкой опытных специалистов на каждом этапе.
    Детальнее – kodirovanie-ot-alkogolizma-ukolom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu