Heroine PoojaHegde: రజనీకాంత్‌ సినిమాలో పూజాహెగ్డే?

Heroine PoojaHegde: రజనీకాంత్‌ 'కూలీ' సినిమాలో హీరోయిన్‌ పూజాహెగ్డే ఓ స్పెషల్‌సాంగ్‌ చేయనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

Viswa
1 Min Read
Heroine PoojaHegde in Rajinikanth Movie

Web Stories

తమిళ ఇండస్ట్రీలో ఫుల్‌ బిజీ అయిపోతున్నారు హీరోయిన్‌ పూజాహెగ్డే (Heroine PoojaHegde). సూర్య ‘రెట్రో’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేశారు. కార్తీక్‌సుబ్బరాజ్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ మే1న రిలీజ్‌ కానుంది. అలాగే దళపతి విజయ్‌ మూవీ ‘జననాయగన్‌’లో హీరోయిన్‌గా చేస్తున్నారు పూజాహెగ్డే. ఈ చిత్రం దీపావళికి రిలీజ్‌ కా నుంది. అలాగే రాఘవాలారెన్స్‌ ‘కాంచన 4’లోనూ ఓ హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారని తెలిసింది.
ఆల్రెడీ చిత్రీకరణ కూడా జరుగుతోంది. మరో హీరోయిన్‌గా నోరాఫతేహీ కనిపిస్తారు.

ఈ తమిళ సినిమాలన్నీ ఇలా ఉండగానే, లేటెస్ట్‌గా మరో తమిళ సినిమా ‘కూలీ’లో పూజాహెగ్డే భాగమై య్యారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ‘కూలీ’ సినిమా రానుంది. ఈ మూవీలో శ్రుతీహాసన్, నాగార్జున, ఆమీర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, షౌబిన్‌ షబ్బీర్‌లు ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

అయితే ఈ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందని, ఈ స్పెషల్‌సాంగ్‌లో పూజాహెగ్డే కనిపిస్తారన్న టాక్‌ ప్రజెంట్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో తమన్నా ‘నువ్వు కావలయ్యా..’ అనే స్పెషల్‌సాంగ్‌ చేశారు. ఈ సాంగ్‌ ఈ సినిమాకు కాస్త మైలేజ్‌నిచ్చింది. ఈ తరహా సాంగ్‌నే ‘కూలీ’లోనూ రెడీ చేశారట మేకర్స్‌. ఈ సాంగ్‌లో పూజాహెగ్డే కనిపిస్తారని టాక్‌. ఇక స్పెషల్‌సాంగ్స్‌ చేయడం పూజాహెగ్డేకు కొత్తం ఏం కాదు. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ మూవీలో ‘జిగేల్‌రాణి’, వెంకటేష్‌ ‘ఎఫ్‌ 3’లో మరో స్పెషల్‌ సాంగ్‌ చేశారు. మరి..‘కూలీ’లో కూడ యాక్ట్‌ చేస్తారా? ఏమో చూడాలి.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi