please subscribe to Tollywoodhub YouTube channel

చిరంజీవి సినిమా కోసం అనిల్‌రావిపూడి ప్రత్యేక పూజలు

Director AnilRavipudi Sentiment: చిరంజీవితో తాను చేయబోయే మూవీ కోసం సింహాచలంలో దర్శకుడు అనిల్‌రావిపూడి స్పెషల్‌ పూజలు చేశారు.

Viswa
1 Min Read
Director AnilRavipudi And Chiranjeevi Movie

Web Stories

దర్శకుడు అనిల్‌రావిపూడి సెంటిమెంట్‌ కంటిన్యూ (Director AnilRavipudi Sentiment) అవుతోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తన ప్రతి సినిమా కథ కోసం వైజాగ్‌ వెళ్తారు. అక్కడే టోటల్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేస్తారు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్, నటీనటుల ఎంపిక తదితర వివరాలపై దృష్టిసారిస్తారు. ఈ సారి కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు దర్శకుడు అనిల్‌రావిపూడి.

చిరంజీవితో సినిమా

దర్శకుడు అనిల్‌రావిపూడి (AnilRavipudi)  డైరెక్షన్‌లోని నెక్ట్స్‌ మూవీలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తారు. సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్స్‌ను వైజాగ్‌లో ప్రారంభించారు అనిల్‌రావిపూడి. ఎప్పటిలానే తన సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ,.. సింహ చలంలోని శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి, స్వామివారి దర్శనం చేసుకున్నారు అనిల్‌ రావిపూడి. అలాగే తాను చిరంజీవితో చేయబోయే సినిమా స్క్రిప్ట్‌ను పూజాకార్యక్రమాల్లో ఉంచారు.

మే లేదా జూన్‌లో షూటింగ్‌: అనిల్‌రావిపూడి

‘‘నా సెంటిమెంట్‌ ప్రకారం శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవాలయంలో పూజలు చేశాను. మరో నెలలో స్క్రిప్ట్‌ వర్క్‌ మొత్తం పూర్తవుతుంది. మే లేదా జూన్‌ మొదటివారంలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాను. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్మ్‌ ఇది. 2026 సంక్రాంతికి రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నాం’’ అని అన్నారు.

హీరోయిన్‌గా అతిదీరావ్‌ హైదరీ?

హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లోని మూవీలో హీరోయిన్‌గా పలువురు కథ నాయికల పేర్లు వినిపిస్తున్నాయి. అతిదీరావ్‌హైదరీ, సోనాక్షీ సిన్హా…వంటి కథానాయికల పేర్లు ఇప్పటివరకు తెరపైకి వచ్చాయి. మరి..ఫైనల్‌గా ఈ మూవీలో ఏ హీరోయిన్‌ యాక్ట్‌ చేస్తారో చూడాలి.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi