NTR Dragon shoot: డ్రాగన్‌ వార్‌ షూరు

NTR Dragon shoot: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లోని 'డ్రాగన్‌' మూవీ చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభం అవుతుంది..

Viswa
1 Min Read
NTRNell Shooting started

Web Stories

ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌నీల్‌ (కేజీఎఫ్, సలార్‌) చేస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘డ్రాగన్‌’ (NTR Dragon shoot) చిత్రీకరణకు సర్వం సిద్ధమైంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఫిబ్రవరి 20న ప్రారంభించి, కొత్త షూటింగ్‌ జరిపారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనలేదు. ఆ మాటొకొస్తే..‘డ్రాగన్‌’ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్‌ ఇంతవరకు పాల్గొనలేదు.

కానీ రేపటి నుంచి కర్ణాటక శివర్లాలో వేసిన ఓ భారీ సెట్‌లో ‘డ్రాగన్‌’ (Dragon) షూటింగ్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటారు. ముందుగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారు. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపించింది.

ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే ఓ ఫారెస్ట్‌ సీక్వెన్స్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్‌. ఈ ఏపిసోడ్‌ సిని మాలో హీరో ఎంట్రీ సీన్‌గా ఉంటుందట. ఫారెస్ట్‌లో జరిగే ఈ చేజింగ్‌ సీన్‌ మూవీకి హైలైట్‌గా ఉంటుందట.

ఈ మూవీ ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, రుక్ష్మిణీవసంత్‌ హీరోయిన్‌గా చేస్తారని, మలయాళ యువ నటుడు టోవినోథామస్‌ విలన్‌గా చేస్తారనే ప్రచారం సాగుతోంది.

ఏప్రిల్‌ 22న మొదలైయ్యే ‘డ్రాగన్‌’ (NTR31) కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ మే మూడోవారం వరకూ జరుగుతుంది. ఆ తర్వాత …‘వార్‌ 2’లో బ్యాలెన్స్‌ ఉన్న సాంగ్‌ షూట్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్‌. మళ్లీ కొంత ‘డ్రాగన్‌’ టాకీ పార్ట్‌ను పూర్తి చేసిన పిదప, జూలై స్టార్టింగ్‌ నుంచి ‘వార్‌ 2’ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటారు. ఎందుకంటే..వార్‌ 2 మూవీ ఆగస్టు 14న రిలీజ్‌ కాబోతుంది.

‘డ్రాగన్‌’ తర్వాత ‘దేవర 2’ షూటింగ్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్‌. ఆ నెక్ట్స్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ మూవీ ఉండొచ్చు. సూర్యదేవరనాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తారు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi