PawanKalyan OG Film: పవన్‌ కళ్యాణ్‌ ఓజీకి టైమోచ్చింది!

Viswa
1 Min Read
PawanKalyan OG Film: పవన్‌ కళ్యాణ్‌ ఓజీకి టైమోచ్చింది!

Web Stories

పవన్‌కల్యాణ్‌ సినిమా ఫ్యాన్స్‌ ఓజీ (PawanKalyan OG Film) సినిమా కోసం ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లడంతో, ఓజీ సినిమా చిత్రీకరణను పూర్తి చేయ డం కుదరడం లేదు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ తన తాజా చిత్రాల్లో ఒకటైన ‘హరి హరవీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. ఇప్పుడు ఓజీ వంతు వచ్చింది. ‘ఓజీ’ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ అవసరం లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది. కొన్ని రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ ఈ ‘ఓజీ’ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అవుతారు.

పవన్‌కల్యాణ్‌ (Pawankalyan)పొలిటికల్‌ యాక్టివిటీస్‌కి ఇబ్బంది లేకుండా విజయవాడ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ‘ఓజీ’ (OG Film) సినిమా తగ్గట్లుగా సెట్స్‌ వేస్తున్నారట. ఇంట్రెవల్, క్లైమాక్స్‌ సన్నివేశాల మినహా ముఖ్యంగా సెకండాఫ్‌ హాఫ్‌లోని సన్నివేశాలను ఈ సెట్స్‌లోనే తీస్తారట ఈ చిత్రం దర్శకుడు సుజిత్‌. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా అరుల్‌ మోహనన్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మీ మెయిన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నాడు. తమిళ యువ నటుడు అర్జున్‌ దాస్, ప్రకాష్‌రాజ్‌ ఇతర కీ రోల్స్‌ చేస్తున్నారు. ఓజీ సినిమాను గత ఏడాది సెప్టెంబరులోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ..కుదరలేదు. ఈ ఏడాదిలోపైన రిలీజ్‌ చేయాలని ఈ చిత్రం దర్శకుడు సుజిత్, నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్‌ చేస్తున్నారు (OG Film Release date). ఇక పోస్ట్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ ‘ఓజీ’ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ (OG OTT)సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Please Share
Share This Article
17 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu