please subscribe to Tollywoodhub YouTube channel

దుల్కర్‌సల్మాన్‌-నాని కాంబినేషన్‌లో మూవీ

Viswa
1 Min Read
Nani will produce Dq Movie

Web Stories

ప్రొడ్యూసర్‌గా మంచి రైజింగ్‌లో ఉన్నాడు నాని. భార్య ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి వాల్‌పోస్టర్‌ సినిమాస్, యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై మంచి సినిమాలనే నిర్మిస్తున్నాడు. రీసెంట్‌ టైమ్స్‌లో నాని నిర్మించిన ‘కోర్ట్‌’ మంచి హిట్‌ ఫిల్మ్‌గా నిలిచింది. అంతకుముందు ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’లో ప్రశాంతితో కలిసి నాని (Producernani) నిర్మించిన ‘అ!, హిట్, హిట్‌ 2’ సినిమాలు కూడా హిట్స్‌ గా నిలిచాయి.

నిర్మాతగా నాని వరుస సినిమాలు హిట్స్‌ కొడుతుండటంతో, ప్రొడ్యూసర్‌గా మరింత బిజీ అవుతున్నాడు నాని. కార్తీతో నాని ఎలాగూ ‘హిట్‌ 4’ సినిమాను నిర్మిస్తాడు. నాని నిర్మాతగా, దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో చిరంజీవి హీరోగా ఓ సినిమా ఉంది. ఇవన్నీ..ఇలా ఉండగానే…కోర్ట్‌ సినిమా దర్శకుడు జగదీష్‌తో నాని మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. వాల్‌పోస్టర్‌సినిమాస్‌ బ్యానర్‌లోనే జగదీష్‌తో మరో స్ట్రాంగ్‌ మూవీ చేసేందుకు నాని సిద్ధమైయ్యాడు. కాగా ఈ మూవీలో దుల్కర్‌సల్మాన్‌ హీరోగా నటిస్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

దుల్కర్‌సల్మాన్‌ (dulquersalman) హీరోగా రానా నిర్మిస్తున్న ‘కాంత’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. తెలుగులో పవన్‌సాధినేనితో ‘ఆకాశంలో ఒక తార’ మూవీ చేస్తున్నాడు దుల్కర్‌సల్మాన్‌. ఇటీవలే దుల్కర్‌సల్మాన్‌ హీరోగా ‘ఐ యామ్‌ గేమ్‌’ అనే మూవీ స్టారై్టంది. ఇన్ని సినిమాల మధ్య నాని ప్రపోజల్‌ను దుల్కర్‌ సల్మాన్‌ యాక్సెప్ట్‌ చేస్తాడా? అనేది చూడాలి.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi