please subscribe to Tollywoodhub YouTube channel

దేవిక అండ్‌ డానీ వెబ్‌సిరీస్‌ రివ్యూ…ఆత్మకు మ్యూజిక్‌ టీచర్‌ చేసిన సాయం ఏంటి?

Viswa

Web Stories

వెబ్‌సిరీస్‌: దేవిక అండ్‌ డానీ (Devika and Danny Review)
ప్రధాన తారాగణం: రీతూ వర్మ, శివకందుకూరి, సూర్య వశిష్ఠ, సుబ్బరాజు, షణ్ముఖ, సోనియా సింగ్, కోవై సరళ
దర్శకుడు: కిషోర్‌
నిర్మాత: సుధాకర్‌ చాగంటి
మ్యూజిక్‌ డైరెక్టర్‌: జే క్రిష్‌
ఎడిటర్‌: కార్తీకేయన్‌ రోహిణి
కెమెరా: వెంకట్‌ సి దిలీప్‌
ఓటీటీ స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌: జీయోహాట్‌స్టార్‌
స్ట్రీమింగ్‌ తేదీ: 2025 జూన్‌ 6 నుంచి స్ట్రీమింగ్‌

కథ

Devika and Danny Review: దేవికా స్కూల్‌లో మ్యూజిక్‌ టీచర్‌. జగన్నాథం (సుబ్బరాజు)తో నిశ్చితార్థం జరుగుతుంది. కానీ దేవిక జాతకంలో మరో అబ్బాయికి చోటున్నట్లుగా ఉంటుంది. జాతకంలో జాతకంలో ఉన్నట్లుగానే  దేవిక జీవితంలోకి డానీ (సూర్య వశిష్ఠ) వస్తాడు. డానీతో ఆల్మోస్ట్‌ ప్రేమలో పడుతుంది దేవిక. కానీ ఇంతలో ట్విస్ట్‌ డానీ మనిషి కాదు..ఆత్మ. ఎవరికీ కనిపించని డానీ ఆత్మ….దేవక, ఆమె తాతలకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? డానీ ఏ ఉద్దేశ్యంతో దేవిక వెంట తిరుగుతున్నాడు? దేవిక జీవి తంలోకి సుబ్బు (శివ కందుకూరి) అనే మరో అబ్బాయి ఎందుకు వచ్చాడు? జగన్నాథంతో దేవిక విషయం ఏమైంది? దేవిక ఇంట్లో వాళ్లకు చెప్పకుండ, ఎందుకు హైదరాబాద్‌ వెళ్లింది? అన్నది ఈ సిరీస్‌ మిగిలిన కథాంశం (Devika and Danny Webseries Review).

విశ్లేషణ

బావిలో కప్పలా ఉండకుండ, జీవితాన్ని హీయిగా జీవించాలని చెబుతున్నట్లున్నాడు దర్శకుడు. ఈ బావి–కప్ప థియరీనే కథలో దేవిక నమ్ముతుంది. అమ్మాయిలు స్వతంత్రభావాలతో ఉం డాలి, సొంత నిర్ణయాలు తీసుకోవాలి, ఈ విషయంలోనూ భయపడకూడదు…అన్న అంశాలను చెప్పాలనుకున్న దర్శకుడు కిషోర్‌ ఇంటెన్షన్‌ బాగుంది. కానీ రోటీన్‌ కథతో ఇలాంటి పాయింట్‌ ను చెప్పాలనుకోవడమే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కథ పాతదే…ప్రజెంటెషనూ కూడా పాతది గానే ఉంటుంది. సూపర్‌పవర్స్‌ ఉన్న దేవిక పాత్రను ఆ దిశగా ఎక్కువగా ఎక్స్‌ఫ్లోర్‌ చేయలేదు. దేవిక యాక్షన్‌ సీన్స్‌ అంత కరెక్ట్‌గా అనిపంచవు. దేవికను డానీ ఏ కలిసే ఉద్దేశం, పాయింట్‌ కూడా కొత్తది ఏం కాదు. కానీ సీనియర్‌ నటి కోవై సరళ ఓ కొత్త తరహా పాత్రలో మెప్పించారు. ఉన్నంతలో బాగా చేశారు.

సిరీస్‌ ఆద్యంతం ఎలాంటి వల్గారిటీ, ద్వంద అర్థాలు, ఆశ్లీల సన్నివేశాలు లేకుండా క్లీన్‌గా సాగి పోవడం బాగుంది. పులిహోర పెంపకం, డ్రాయర్‌ ప్యాంటసీ…వంటి కాన్సెప్ట్‌లు నవ్వు తెప్పిం చాయి. కానీ ఈ డోస్‌ సరిపోలేదు. ఇంకాస్త కామెడీ ఉండాల్సింది. అలాంటి స్కోప్‌ ఉన్న సిరీస్‌ కూడా ఇది. అలాగే దేవికా తాత పాత్రను ఐదారుషాట్స్‌లో పవర్‌ ఫుల్‌గా చూపించారు. కానీ ఆయన పాత్ర ఇంపాక్ట్‌ అయితే ఈ సిరీస్‌లో లేదు. ఈ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌లో ఉం టుందె మో చూడాలి. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ సాగుతుంది. పెద్ద నిడివి ఉన్న ఎసిపోడ్స్‌ ఏం కాదు. ఓ పెద్ద సినిమా చూసినట్లుగానే ఉంటుంది.

పెర్ఫార్మెన్స్‌

దేవిక పాత్రలో రీతూవర్మ (Rituvarma OTT) చక్కగా నటించారు. కానీ యాక్షన్‌ సీన్స్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. డానీ పాత్రలో వశిష్ఠ మెప్పించాడు. ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌లో మంచి యాక్టింగ్‌ చూపించాడు. కానీ ఈ పాత్ర చాలా రోటీన్‌గా ఉంటుంది. సుబ్బుగా శివ కందుకూరి పాత్ర సీరిస్‌లో కాస్త లేట్‌గా వచ్చినా, ఈ పాత్రకు హ్యూమర్‌ ఉండటం బాగుంది. ఈ పాత్రను ఇంకాస్త ఎలివేట్‌ చేయాల్సింది కథలో. పెళ్లికొడుకు జగ్గు పాత్రలో సుబ్బరాజు ఉన్నంతలో బాగానే చేశాడు. ఒకట్రెండు సీన్స్‌లో నవ్వు తెప్పించే ప్రయత్నం చేశాడు. గాయ త్రిగా కోవై సరళ ఓ బాధితురాలిగా, సీరియస్‌ యాక్టింగ్‌ రోల్‌ చేశారు. వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌గా వైవా హర్ష, పీటీ మాస్టర్‌గా చమ్మక్‌ చంద్ర, రితూ వర్మ తండ్రిగా శివన్నారాయణ, జగన్నాథం (సుబ్బరాజు) తండ్రి పాత్రలో గోపరాజు రమణ, విలన్‌గా షణ్ముఖ్‌ యాక్ట్‌ చేశాడు. సోనియా, అభినయ వారి వారి పాత్రల మేరకు యాక్ట్‌ చేశారు. సుధాకర్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. కార్తికేయన్‌ ఎడిటింగ్‌ ఒకే. జై క్రిష్‌ సంగీతం ఫర్వాలేదు (Devika and Danny Review)

హీరో అక్కినేని అఖిల్‌-జైనాబ్‌ల పెళ్లి ఫోటోలు అండ్‌ వివరాలు

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi