కన్ఫార్మ్‌..అల్లు అర్జున్‌ మూవీలో దీపికా పదుకొనె

Viswa

అల్లు అర్జున్‌ సినిమాలో దీపికా పదుకొనె (Deepikapadukone in AA22 ) కన్ఫార్మ్‌ అయిపోయారు. ఈ మూవీలో దీపికా పదుకొనె (Deepikapadukone) ఓ యాక్షన్‌ క్వీన్‌ రోల్‌ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌ (Alluarjun) హీరోగా అట్లీ డైరెక్షన్‌లో ఓ మూవీ రూపుదిద్దుకుంటుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను (AA22 A06) నిర్మి స్తుంది. ఈ మూవీలో దీపికా పదుకొనె ఓ లీడ్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లుగా శనివారం మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు.

Deepikapadukone is part of AlluArjun and Atlee movie
Deepikapadukone is part of AlluArjun and Atlee movie

దీపికా పదుకొనెకు అట్లీ కథ (Atlee) చెప్పడం, ఆమె ఈ కథకు ఇంప్రెస్‌ అవ్వడం, ఆ తర్వాత వర్చు వల్‌గా ఆ పాత్ర లుక్‌ టెస్ట్‌ వంటి విజువల్స్‌తో ఈ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ విజువల్స్‌ని బట్టి, దీపికా పదుకొనె ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నట్లుగా స్పష్ట మౌతోంది. మరోవైపు ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారని, హీరో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారని అనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రకారం…దీపికా పదుకొనెతో పాటుగా, మరో నలుగురు హీరోయిన్స్‌కు ఈ సినిమాలో చోటు ఉంది. వీరిలో జాన్వీకపూర్, మృణాల్‌ఠాగూర్‌ ఆల్మోస్ట్‌ కన్ఫార్మ్‌ అయ్యారని, అతి త్వరలోనే అధికారిక అనౌన్స్‌మెంట్‌ రావొచ్చని టాక్‌. అల్లు అర్జున్‌ కెరీర్‌లోని ఈ 22వ సినిమాను 2027లో విడుదల చేయాలను కుంటన్నారు.

AlluArjun Atlee movie Shoot
AlluArjun Atlee movie Shoot5

ఇక షారుక్‌ఖాన్‌ హీరోగా నటించి, దీపికా పదుకొనె ఓ కీలక పాత్రలో చేసిన ‘జవాను’ (jawan) సినిమాలో దీపికా పదుకొనె ఓ కీలక పాత్రలో యాక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు అట్లీతో మరోసారి వర్క్‌ చేస్తున్నారు దీపికా పదుకొనె. అలాగే తెలుగు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తీస్తున్న ‘కల్కి2898ఏడీ’ సిరీస్‌లోనూ దీపికా మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్‌బచ్చన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్న ఈ మూవీలో రెండోపార్టు ‘కల్కి2898ఏడీ’ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంద. ఇంకా ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమాలోనూ దీపికా పదుకొనె హీరోయిన్‌గా ఆల్మోస్ట్‌ ఒకే అయ్యారని, కానీ క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారనే వార్తలు ఉన్నాయి. ఈ సినిమాకు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *