సాయితేజ్‌ పరిస్థితి ఏమిటిప్పుడు?

Viswa
SaiDurgaTej SYG Movie postponed

Web Stories

దసరా సందర్భంగా పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’, బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాల విడుదల గురించి చర్చ జరుగుతుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే…సెప్టెంబరు 25నే విడుదల అవు తాయా? అన్నది హాట్‌ టాపిక్‌. కానీ ఈ రెండు సినిమాలకంటే ముందుగానే సెప్టెంబరు 25ను లాక్‌ చేసిన సినిమా ‘సంబరాల ఏటిగట్టు’ (SYG Movie). సాయి ధరమ్‌తేజ్‌ (SaiDurgaTej) హీరోగా చేస్తున్న సినిమా ఇది.రాయలసీమ నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘హను–మాన్‌’ సినిమాను నిర్మించిన నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డిలు ఈ సినిమాను రూ. 120 కోట్ల రూపాయాల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 70శాతం సినిమా (SambaralaYetigattu)షూటింగ్‌ పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్‌ కెపీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సంబరాల ఏటిగట్టు సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసిన సమయంలోనే, సెప్టెంబరు 25న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పవన్‌కల్యాన్‌ ‘ఓజీ’ సినిమా అదే డేట్‌కి వస్తుంది కాబట్టి, ఇక సంబరాల ఏటిగట్టు సినిమా ఆ తేదీకి రాకపోవచ్చు. దసరా సీజన్‌ కదా… రెండు,మూడు సినిమాల రిలీజ్‌లకు స్కోప్‌ ఉంటుందని, యూనిట్‌ భావించినా, డిస్ట్రి బ్యూటర్స్‌ను ఓజీ కాదని, సంబరాల ఏటిగట్టు వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువ. మరి..నవంబరులో రావడానికి, నవంబరును డల్‌ సీజన్‌గా భావిస్తారు ఇండస్ట్రీ వాసులు. డిసెంబరు స్టార్టింగ్‌లో ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’గా వస్తున్నాడు. క్రిస్మస్‌కి ఆల్రెడీ అడవి శేష్‌ ‘డకాయిట్‌’తో కర్ఛీప్‌ వేశాడు. సంక్రాంతికి ఆల్రెడీ ఇప్పటికే నాలుగు సినిమాలు రెడీ అయ్యా యి.ఇలాంటి పరిస్థితుల్లో సంబరాల ఏటిగట్టు సినిమా కొత్త విడుదల తేదీపై కాస్త ఆసక్తి నెలకొని ఉంది.

సంబరాల ఏటిగట్టు సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా చేస్తుంది. శ్రీకాంత్‌, అనన్యనాగళ్ల ఓ ప్రధాన పాత్రధారులు. ఈ మాస్‌ యాక్షన్‌ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi