please subscribe to Tollywoodhub YouTube channel

గాడ్‌ ఆఫ్‌ వార్‌ లార్డ్‌ కుమారస్వామిగా ఎన్టీఆర్‌..కన్ఫార్మ్‌ చేసిన నాగవంశీ

Viswa

Web Stories

అల్లు అర్జున్‌ కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంతో కష్టపడి, లార్డ్‌ కార్తికేయ స్వామి నేపథ్యంతో ఓ భారీ మైథలాజికల్‌ సినిమా కథను రెడీ చేశాడు. కానీ ఈ కథను పక్కన పెట్టి, అట్లీ స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్లాడు అల్లు అర్జున్‌. దీంతో త్రివిక్రమ్‌ నొచ్చుకుని, ఈ కథను ఎన్టీఆర్‌తో తీయాలని నిర్ణయించుకున్నారు (NTRTrivikram)…అన్న వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తలు నిజమే అన్నట్లుగా నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ‘ఎక్స్‌’ వేదికగా వార్‌ ఆఫ్‌ గాడ్‌ కార్తికేయ పాత్రలో ఎన్టీఆర్‌ నటించనున్నట్లుగా పరోక్షంగా వెల్లడించారు. దీంతో అల్లు అర్జున్‌ కథ, ఎన్టీఆర్‌కు షిఫ్ట్‌ అయిపోయిన విషయం అధికారికమైపోయింది (NTRTrivikram)

కాగా ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుంది? అన్నదే ప్రస్తుత ప్రశ్న. త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసి, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను కూడా ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ చేశాడు. ఆ తరుణంలో త్రివిక్రమ్‌ను కాస్త వెయిట్‌ చేయమన్నట్లుగా అల్లు అర్జున్‌ చెప్పారట. సో..కథ, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయ్యాయి, కాబట్టి ‘డ్రాగన్‌’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ ఈ సినిమాను స్టార్ట్‌ చేసిన ఆశ్చర్యం లేదు. ఇదే జరిగితే…కొరటాల శివతో ఎన్టీఆర్‌ చేయాల్సిన ‘దేవర2’, నెల్సన్‌తో ఎన్టీఆర్‌ చేయాల్సిన సినిమాలు కాస్త ఆలస్యంగా ప్రారంభం అవుతాయి. మరి..ఏం జరుగు తుందో చూడాలి.

విడిపోయిన ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లను కలిపిన అల్లు అర్జున్‌

ప్రజెంట్‌ ‘వార్‌ 2’ సినిమా కోసం హిందీ, తెలుగు, తమిళం భాషల్లో డబ్బింగ్‌ చెప్పే పనిలో ఉన్నారు ఎన్టీఆర్‌. హృతిక్‌రోషన్‌ మరో హీరోగా యాక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. కియారా అద్వానీ మరో లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. ‘వార్‌ 2’ ప్రమోషన్స్‌ తర్వాత ఎన్టీఆర్‌ తిరిగి ప్రశాంత్‌నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్‌’ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు. ఈ చిత్రం జూన్‌ 25, 2026న విడుదల కానుంది.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi