ఆమిర్‌ఖాన్‌ సితారే జమీన్‌ పర్‌ మూవీ రివ్యూ

Kumar NA
Aamirkhan Sitaare ZameenPar movie poster

SitaareZameenPar Review: ఢిల్లీ బాస్కెట్‌బాల్‌ టీమ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ గుల్షన్‌ గ్రోవర్‌. కాస్త అహంకారి. తన సీనియర్‌పై చేయిచేసు కున్నందు కు, గుల్షన్‌ సస్పెండ్‌ అవుతాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో మద్యం సేవించి, కారు నడిపి, ఏకంగా పోలీసు కారునే చిన్న యాక్సి డెంట్‌ చేస్తాడు. కోర్టుకు వెళ్తాడు. అక్కడ గుల్షన్‌ ఓ బాస్కెట్‌ బాల్‌ కోచ్‌ అని తెలియ గానే, జడ్జ్‌ ఓ విభిన్నమైన తీర్పు ఇస్తుంది. గుల్షన్‌కు శిక్షగా, మానసిక దివ్యాంగులైన పదిమందికి బాస్కెట్‌ బాల్‌ నేర్పించాల్సిందిగా, ఆర్డర్‌ వేస్తుంది. గుల్షన్‌కు ఇది ఏ మాత్రం ఇష్టం ఉండదు. కానీ కోర్టు ఆదేశాలను సారంగా, మానసిక దివ్యాంగులకు మూడు నెలల పాటు బాక్సెట్‌బాల్‌ ట్రైనింగ్‌ ఇచ్చేందుకు వెళ్తాడు. మరి.. అక్కడ గుల్షన్‌కు ఎదురైన పరిస్థి తులు ఏమిటి? గుల్షన్‌ తనను తాను ఎలా సరిద్దిద్దుకున్నాడు? తన భార్య సునీతతో ఉన్న మనస్ఫర్థలను ఎలా చక్కబెట్టుకున్నాడు? తాను కోచింగ్‌ ఇచ్చే ‘సితారే..’టీమ్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో విజయం సాధించిందా? అనేది సినిమా చూడాలి (SitaareZameenPar ).

ఆమిర్‌ఖాన్‌ (Aamirkhan) కెరీర్‌లోని హిట్‌ ఫిల్మ్‌ ‘తారే జమీన్‌ పర్‌’ సినిమా సూపర్‌హిట్‌. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సితారే జమీన్‌ పర్‌’ (SitaareZameenPar) తీశాడు ఆమిర్‌ఖాన్‌. ‘తారే జమీన్‌ పర్‌’ సినిమాకు ఆమిర్‌ఖాన్‌యే దర్శకత్వం వహించగా, ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమాకు మాత్రం ఆర్‌ఎస్‌. ప్రసన్న దర్శకత్వం వహించారు. గతంలో ఆర్‌ఎస్‌. ప్రసన్న తో ఆమిర్‌ఖాన్‌ ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఇక స్పానిష్‌ మూవీ ‘చాంపియన్‌’కు హిందీ రీమేక్‌గా ‘సితారే జమీన్‌ పర్‌’ రూపొందింది. ఈ సినిమాను తొలుత సల్మాన్‌ఖాన్‌తో తాను నిర్మాతగా చేయాలనుకున్నాడు ఆమిర్‌ఖాన్‌. కానీ సల్మాన్‌ఖాన్‌ సున్నితంగా తిరస్కరించడంతో, ‘చాంపియన్‌’ రీమేక్‌ రైట్స్‌ తన దగ్గరే ఉండటంతో, ఆమిర్‌ఖాన్‌యే ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమాలో హీరోగా నటించి, నిర్మించాడు.

Aamirkhan Sitaare ZameenPar movie Working Still
Aamirkhan Sitaare ZameenPar movie Working Still

ప్రస్తుత సమాజంలో మానసిక దివ్యాంగులను తక్కువగా చూసేవారి ఎక్కవగానే ఉంటున్నారు. అయితే వారిని జాగ్రత్తగా గమనించి, వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తే, వారు కూడా ఏదైనా సాధించగలరు అనే ఓ చక్కని సందేశాన్ని ఆర్‌ఎస్‌. ప్రసన్న ఈ సినిమాతో ఆడియన్స్‌కు చెప్పారు. ఈ సినిమాలో మానసిక దివ్యాంగులకు, గుల్షన్‌ పాత్రల మధ్య ఉండే భావోద్వేగ సంఘర్షణలు, సన్నివేశాలు ఆడియన్స్‌ హృదయా లను హత్తుకునేలా ఉంటాయి. మానసిక దివ్యాంగులుగా చేసిన పదిమంది, స్క్రీన్‌పై చక్కగా కనిపించారు.
కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే ఆమిర్‌ఖానునే డామినేట్‌ చేసాలా చేశారు. భావోద్వేగం, హాస్యం కలగలిపిన ఈ సినిమా ఆడియన్స్‌ను కచ్చితంగా అలరిస్తుంది. కానీ ఆమిర్‌ఖాన్, జెనిలీయాల మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా ట్రాక్, సంఘర్షణల నిడివి కాస్త తక్కువగా ఉండాల్సింది. కొన్ని సాగదీత సన్నివేశాలూ ఉన్నాయి. ఇక ‘సితారే టీమ్‌’ బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌లలో దర్శకుడు ఆర్‌.ఎస్‌ ప్రసన్న కాస్త సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాడనిపిస్తుంది. క్లైమాక్స్‌ మెప్పిస్తుంది.

ఆమిర్‌ఖాన్‌ బాగా యాక్ట్‌ చేశాడు. ఎప్పటిలాగానే తన మార్క్‌ యాక్టింగ్, తన యాక్టింగ్‌ అనుభవాన్ని చూపించాడు. హాస్యం, భావోద్వేగాల సన్నివేశాల్లో ఆమిర్‌ఖాన్‌ యాక్టింగ్‌ గురించి, ప్రత్యేకంగామళ్లీ చెప్పాల్సింది ఏముంది. తన స్థాయి నటన చూపించాడు. జెనీలియా కూడా చక్కని నటన చూపించారు స్క్రీన్‌పై. వెండితెరపై ఆమిర్‌ఖాన్‌–జెనిలియాల కెమిస్ట్రీ పర్వాలేదు. సునీతగా జెనిలియా మరో మంచి పాత్ర చేశారు. ఇక మానసిక దివ్యాంగులుగా స్క్రీన్‌పై కనిపించిన మిగతా వారు కూడా ఏం తక్కువ కాదు. ఒకరి ద్దరు అయితే సూపర్‌పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. సాంకేతిక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సాగదీత సన్ని వేశాలకు కాస్త కత్తెర పడి ఉంటే బాగుండేది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *