please subscribe to Tollywoodhub YouTube channel

కాంతారకు సీక్వెల్‌ కాదు..ప్రీక్వెల్‌ ఫిక్స్‌

Viswa
RishabhShetty kantara Chapter1 firstlook

Web Stories

కన్నడ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘కాంతార’ 2022లో విడుదలైంది. రూ. 20 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. రిషబ్‌శెట్టి (RishabhShetty) హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిం చింది. సప్తమి గౌడ, కిషోర్‌, అచ్చుత్‌ కుమార్‌ ఈ సినిమాలోని ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌, అజనీష్‌ లోకనాథ్‌ మ్యూజిక్‌ ఈ ‘కాంతార’ సినిమాకు బాగా ఫ్లస్‌ అయ్యాయి (Kantara Chapter1 movie).

కాంతార సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో, రిషబ్‌శెట్టి ‘కాంతార’ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటిస్తారనే టాక్‌ వినిపించింది. అనుకున్నట్లుగానే ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. దీంతో ఈ ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా ‘కాంతార’ సినిమాకు సీక్వెల్‌ అనే అనుకున్నారు. కానీ..’కాంతార చాప్టర్‌ 1′ అనేది ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌ (Kantara Chapter1 movie) అని మేకర్స్‌ కన్ఫార్మ్‌ చేశారు. అయితే కాంతార చాప్టర్‌ 1 సినిమాను ప్రకటించినప్పుడే, ఈ మూవీని అక్టోబరు 2న రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు.

కానీ ఇటీవలి కాలంలో ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా షూటింగ్‌కు వరుస అవాంతరాలు ఎదురైయ్యాయి. ఒకరిద్దరు చనిపోయారు కూడ. దీంతో ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా అక్టోబరు 2న విడుదల కాదనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది. కానీ సోమవారం రిషబ్‌శెట్టి బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, ఈ సినిమాను అక్టోబరు 2నే రిలీజ్‌ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. అదీ సంగతి. అక్టోబరు 2న గాంధీ జయంతి కావడం, దసరా హాలీడేస్‌ ఉండటం, లాంగ్‌ వీకెండ్‌…తమ ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమాకు కలిసొస్తాయని టీమ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

నితిన్‌ తమ్ముడు హిట్టా? ఫట్టా?

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi