please subscribe to Tollywoodhub YouTube channel

జీవిత సత్యాలతో విలేజ్‌లో రోలిగుంట సూరి

Kumar NA
Rolugunta Suri Movie First Look poster News

Web Stories

Rolugunta Suri Movie First Look poster: విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న రియలిస్టిక్‌ ఎమోషనల్‌ డ్రామా ‘రోలుగుంట సూరి’. అనిల్‌ కుమార్‌ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. తపస్వీ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై సౌమ్య చాందిని పల్లా ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రాజేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌లుక్‌ నన్ను ఇంప్రెస్‌ చేసింది. ఇలాంటి సినిమాలు సైలెంట్‌గా వచ్చి, ఆడియన్స్‌ను ఇంప్రెస్‌ చేస్తాయి. చిత్రంయూనిట్‌కు అభినందనలు’’ అని అన్నారు.

Rolugunta Suri Movie First Look poster Launch
Rolugunta Suri Movie First Look poster Launch

దర్శకుడు అనిల్‌ కుమార్‌ పల్లా మాట్లాడుతూ – ‘‘రాజేంద్రప్రసాద్‌గారు మా సినిమా ఫస్ట్‌లుక్‌ను లాంచ్‌ చేయడం మాకు ఉత్సాహాన్నిచ్చింది. తెలుగు సినిమా చరిత్రలో మా సినిమా నిలిచిపోతుంది. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత సౌమ్య చాందిని.

బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుభాష్‌ ఆనంద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సందీప్‌ చక్రవర్తి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi