పాలిటిక్స్‌ ఈజ్‌ పర్సనల్‌

SPM
SPM
1 Min Read

Web Stories

Vishwak Sen Legacy: విశ్వక్‌సేన్‌ (Vishwak Sen )హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘లెగసీ’ ( Legacy) అనే టైటిల్‌ ఖరారైంది. పొలి టికల్‌ యాక్షన్‌ డ్రామా రానున్న ఈ సినిమాకు ‘పిండం’ ఫేమ్‌ సాయికిరణ్‌ దైదా దర్శ కుడు. యశ్వంత్‌ దగ్గుమాటితో కలిసి సాయికిరణ్‌ దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఓ పాపులర్‌ పొలిటికల్‌ లీడర్‌ అయిన తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తి సిద్ధార్థ అనే వ్యక్తి పాత్రలో విశ్వక్‌సేన్‌ యాక్ట్‌ చేస్తున్నాడు.

న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ ‘లెగసీ’ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. పాలిటిక్స్‌ ఈజ్‌ పర్సనల్‌ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది ( Legacy Movie Announcement Teaser)

‘‘మనం ఎవర్నైతే గాఢంగా ప్రేమిస్తామో, వారిని తీవ్రంగా ద్వేషించే సమ యం వస్తుంది. అప్పుడు వాళ్ల నుంచి మనం దూరంగా పారిపోవాలని అనుకుంటాము.
కానీ మన డీఎన్‌ఏ మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఒక తండ్రిని క్షమించలేని కొడుకు, పవర్‌గేమ్స్‌లో తన కుటుంబాన్ని కూడా వాడుకునే తండ్రి, దిస్‌ ఈజ్‌ యాన్‌ ఇంటర్‌నెల్‌ వార్‌ ఫర్‌ రియల్‌ లెగసీ’ అంటూ విశ్వక్‌సేన్‌ చెప్పే డైలాగ్స్‌ ఈ ‘లెగసీ’ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌లో ఉన్నాయి.

ఇక ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ ఈ సినిమాకు దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi