ఏ బీటెక్‌ కుర్రాడు ఆన్సర్‌ చెప్పలేడు!

Viswa

Web Stories

NariNariNadumaMurari: శర్వానంద్‌ (Sharwanand NariNariNadumaMurari Movie) హీరోగా నటించిన తాజా సినిమా ‘నారీ నారీ నడుమ మురారీ (NariNariNadumaMurari)’. ఈ చిత్రంలో సాక్షీ వైద్య, సంయుక్త హీరోయిన్స్‌గా నటించగా, ‘సామజవరగన’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు (NariNariNadumaMurari Director Ramabbaraju)  ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘సామజవరగమన’ సినిమాకు కథ అందించిన భాను భోగవరపు ఈ ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమాకూ కథ అందించగా, నందు డైలాగ్స్‌ ఇచ్చాడు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మాం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం నుంచి థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఈ సినిమాలో నిత్య పాత్రలో సాక్షీ వైద్య, దియా పాత్రలో సంయుక్త, గౌతమ్‌ పాత్రలో శర్వానంద్‌ నటించారు. ఒకే ఆఫీసులో ఓ అబ్బాయి ప్రజెంట్‌ లవర్, ఎక్స్‌ లవర్‌ ఉంటే, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా కథ సాగుతుంది. వీకే నరేశ్, సత్య, సునీల్, శ్రీకాంత్‌ అయ్యంగార్, సంపత్‌రాజ్‌లు  (NariNariNaduma Murari Cast And Crew) ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

‘‘అవును.. ఈ గౌతమ్‌ ఎవరమ్మా…’,

‘నేను..గౌతమ్‌ లవ్‌లో ఉన్నాం..’,

‘ఏం చేస్తున్నావ్‌..’,

‘ఇంజనీరింగ్‌ చదివి..ఆర్కిటెక్చర్‌గా జాబ్‌ చేస్తున్నాను..సార్‌’,

‘మరి..ఇంజనీరింగ్‌ ఎందుకు చేశావ్‌..’,

‘ఈ క్వశ్చన్‌కు నేనే కాదు..సార్‌..బీటెక్‌ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్‌ చెప్పలేడు..’,

‘నా లైఫ్‌ నా వైఫ్‌ నీ చేతిలో ఉంది…’

‘నువ్వు చేసిన పనిని…నిత్యకు చెప్పేచేయ్‌..’

‘నీ బాధ పోవాలంటే మందు ఒక్కటే మార్గం’

‘ఓ..రెండో పెళ్లా..కాదు..మళ్లీ పెళ్ళి’

గతంలో శర్వానంద్‌ హీరోగా నటించిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’, ‘శతమానంభవతి’ సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలై, సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి శర్వానంద్‌ నటించిన ‘నారీ నారీ నడము మురారీ’ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుండటం విశేషం. మరి..ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi