శర్వానంద్‌ ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా ఫస్ట్‌ రివ్యూ

Viswa

Web Stories

Nari Nari Naduma Murari First Review: శర్వానంద్‌కు ఓ సాలిడ్‌ హిట్‌ వచ్చి, చాలా రోజులైంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతోనే శర్వానంద్‌ (Sharwa) ఆడియన్స్‌ ముందుకు వస్తున్నప్పటికీని, ఈ చిత్రాలు ఎందుకో బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్‌ నుంచి వస్తున్న తాజా సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari First Review). సంయుక్త (Nari Nari Naduma Murari Heroine Samyuktha) సాక్షీ వైద్య (Nari Nari Naduma Murari Heroine Sakshi Vaidya) ఈ చిత్రంలోని హీరోయిన్‌ రోల్స్‌ చేశారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా, మంచి హ్యూమర్‌తో కనిపించింది. గత ఏడాది ‘సామజవరగన’ వంటి సూపర్‌హిట్‌ దర్శకత్వం వహించిన రామ్‌ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ‘సామజవరగమన’ సినిమాకు అసోసియేట్‌ అయిన స్టోరీ రైటర్‌ భాను భోగవరపు, డైలాగ్స్‌ రైటర్‌ నందు ఈ ‘నారీ నారీ నడుమమురారీ’ (Nari Nari Naduma Murari ) సినిమాకూ పని చేశారు. ఈ చిత్రం ఈ సంక్రాంతి సంద ర్భంగా జనవరి 14 సాయంత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. మరి..ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై ఓ లుక్‌ వేద్దాం (NariNariNadumaMurari FirstReview).
చిరంజీవి మనశంకరవరప్రసాద్‌గారు రివ్యూ

ఈ సినిమాలో గౌతమ్‌ పాత్రలో శర్వానంద్, దియా పాత్రలో సంయుక్త, నిత్య పాత్రలో సాక్షీ వైద్య నటించారు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో…రెండు లవ్‌స్టోరీలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. గౌతమ్‌ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు…గౌతమ్‌–దియాల లవ్‌స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత వీరిద్దరికీ బ్రేకప్‌ అవుతుంది. గౌతమ్‌ ఉద్యోగంలో జాయిన అయిన తర్వాత నిత్య తో ప్రేమ మొదలవుతుంది. అలా గౌతమ్‌–నిత్యాల లవ్‌ట్రాక్‌ ఉంటుంది. గౌతమ్‌–నిత్యాలు ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. వీరి ఆఫీస్‌కి టీమ్‌ లీడర్‌గా దియా వస్తుంది. ఇలా ఒకే ఆఫీసులో అటు మాజీ లవర్‌.., ఇటు..ప్రజెంట్‌ లవర్‌తో నలిగిపోయే ఓ అబ్బాయి పాత్రలో శర్వానంద్‌ నటించాడని తెలుస్తుంది. (SharwanandNariNariNadumaMurari)
ప్రభాస్‌ ది రాజాసాబ్‌ రివ్యూ

ఇక గౌతమ్‌–నిత్యల లవ్‌ట్రాక్‌తో ఈ సినిమా తొలిభాగం సాగితే, సెకండాఫ్‌లో గౌతమ్‌–నిత్య–దియాల కాంబినేషన్‌ సీన్స్‌ కొన్ని హీలేరియస్‌గా, మరికొన్ని ఎమోషనల్‌గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రామబ్రహ్మాం సుంకర, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మెయిన్‌ ఫ్లాట్‌ మాత్రం కామెడీనే అన్నట్లుగా తెలిసింది. సంపత్‌ రాజ్, సత్య, ముఖ్యంగా వీకే నరేష్‌, సునీల్‌లతో (NariNariNadumaMurari Cast and Crew) వచ్చే సీన్స్‌ బాగా వచ్చాయని టాక్‌. శర్వానంద్‌ హీరోగా చేసిన ‘రన్‌ రాజా రన్‌’ సినిమాలో హీరో శర్వానంద్‌– హీరోయిన్‌ తండ్రి సంపత్‌ రాజ్‌ల మధ్య ఓ ట్రాక్‌ ఉంటుంది.ఈ తరహా ట్రాక్‌ ఈ ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమాలోనూ ఉందిని ఆల్రెడీ రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు ఓ స్పెషల్‌ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సినిమాలో గౌతమ్‌ పాత్రకు తండ్రి అయ్యే యోగ్యత ఉందా? లేదా? అనే పాయింట్‌ని కూడా దర్శకుడు టచ్‌ చేసినట్లుగా తెలిసింది (NariNariNadumaMurari).

గతంలో శర్వానంద్‌ హీరోగా నటించిన ‘శతమానంభవతి’, ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’సినిమాలు సంక్రాంతికి విడుదలై, సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్‌ నుంచి తాజాగా ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా సంక్రాంతికి వస్తుంది. మరి..ఈ సంక్రాంతి సినిమా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos