ఓటీటీలో శంబాల మూవీ..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..!

Viswa

Web Stories

Shambhala Aha Ott Release: ఒక హిట్‌ మూవీ కోసం ఆది సాయికుమార్‌ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు. ఈ హిట్‌ ఆది సాయికుమార్‌కు ‘శంబాల’ చిత్రంతో దక్కింది. యుగంధర్‌ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. షైనింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించిన ఈ మిస్టికల్‌ థ్రిల్లర్‌ సినిమా గత ఏడాది డిసెంబరు 25న థియేటర్స్‌లో విడుదలైంది. కాగా, ఈ సినిమా ఈ నెల 22 (Shambhala movie OTT release date)నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది (Shambhala streaming on Aha). ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో అర్చన అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా, స్వసిక, మధునందన్, రవి వర్మ, రామరాజు, ప్రవీణ్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ హారర్‌ మిస్టికల్‌ థ్రిల్లర్‌ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల మ్యూజిక్‌ అందించారు (Shambhala movie OTT release).

ఓ గ్రామంలో సంభవిస్తున్న విచిత్రమైన హత్యలను ఢిల్లీ నుంచి వచ్చిన విక్రమ్‌ అనే సైంటిస్ట్‌ ఏ విధంగా చేధించాడు? బండభూతం ఆ గ్రామ ప్రజలను ఏ విధంగా ఇబ్బందిపెట్టింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ శంబాల సినిమా కథనం సాగుతుంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా దాదాపు రూ. 20 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ను సాధించిందని ట్రేడ్‌ పండితులు విశ్లేషించారు. తెలుగులో విడుదలైన తర్వాత ‘శంబాల’ సినిమాను హిందీలోనూ విడుదల చేసినా, అక్కడి ఆడియన్స్‌ను శంభాల చిత్రం పెద్ద స్థాయిలో ఏట్రాక్ట్‌ చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది (latest Telugu OTT releases).

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi