అసలు..నాపై టికెట్‌ ఎందుకు తెగాలి?..అనుకున్నాను

Viswa

Web Stories

ఇటీవల సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు శర్వానంద్‌. తన తర్వాతి సినిమాల కోసం అద్భుతంగా ట్రాన్ఫార్మ్‌ అయ్యాడు. సరైన వ్యాయామాలతో సరికొత్తగా మేకోవర్‌ అయ్యాడు. ఈ ప్రయాణం, తన సరికొత్త మేకోవర్‌ గురించి, శర్వానంద్‌ చెప్పుకున్న విశేషాలు..(Sharwanand latest interview)

‘జాను’ (తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘96’ సినిమా తెలుగు రీమేక్‌) సినిమా చిత్రీకరణ నాకు చాలా పెద్ద మేజర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. చేయి కూడా రాదన్నారు. కానీ సంకల్ప బలంతో తిరిగి కోలుకోగలిగాను. కానీ చాలా లావుగా అయ్యాను. ఆ సమయంలోనే ‘శ్రీకారం, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలు చేశాను. ఆ సమయంలో నా లుక్‌ నాకే నచ్చలేదు. అప్పటి గురించి ఆలోచిస్తుంటే…‘అసలు..నాపై టికెట్‌ ఎందుకు తెగాలి?’ అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది (Nari Nari Naduma Murari interview).

ముందు నాకు నేను కరెక్ట్‌గా ఉండాలని నా లుక్‌ మార్చాలనుకున్నాను. అలా వాకింగ్‌ స్టార్ట్‌ చేశాను. ఆ స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ చేశాను. యోగ చేశాను. అలా..టోటల్‌గా ఇప్పుడు ఈ లుక్‌లోకి వచ్చాను (Sharwanand success meet).

ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ కావడం హ్యాపీ

‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ విన్నప్పుడే అనిపించింది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజైన బ్లాక్‌బస్టర్‌ అవుతుందని. మా నమ్మకం నిజమైంది. నా కెరీర్‌లో నటుడిగా నేను ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు, కొత్త తరహా పాత్రలూ చేస్తూనే ఉన్నప్పటికీని, ఈ క్రమంలో ‘శతమానంభవతి, అమ్మచెప్పింది. అందరి బందువయ’ వంటి సినిమాలతో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువకావడం సంతోషాన్ని ఇచ్చింది.

Sharwanand about his NariNariNadumaMurari Movie SuccessMeet

ఓటీటీ బోనస్‌

ఓటీటీల కోసం మనం సినిమాలు చేయకూడదు. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న సినిమాలు చేయాలి. ఏదైనా ఒక సినిమా థియేటర్స్‌లో విడుదలై, మంచి రెవెన్యూ వస్తే ఓటీటీ సంస్థలు కూడా హ్యాఫీ ఫీలవు తాయి. ఎందుకంటే..థియేట్రికల్‌ రెవెన్యూ ఉన్న సినిమాలకు, ఓటీటీల్లోనూ మంచి వ్యూయర్‌ షిప్‌ ఉంటుంది.

నా తర్వాతి సినిమాలు

నేను యాక్ట్‌ చేసిన ‘బైకర్‌’ సినిమా త్వరలోనే విడుదల అవుతుంది. ప్రస్తుతం సంపత్‌నందితో ‘భోగి’ సినిమా చేస్తున్నాను. ఇందులో కొత్త లుక్‌లో కనిపిస్తాను. అలాగే శ్రీనువైట్లగారితో ఓ కామెడీ మూవీ చేస్తున్నాను. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos