Ustaad Bhagat Singh Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ఓజీ’ (OG) చిత్రంతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఓజి తరువాత ఆయన. నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి (telugu movies).
రాజకీయ బాధ్యతల వల్ల ఆలస్యమైన ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక పక్కా డేట్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 23 లేదా 24 తేదీలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత మైత్రీ రవి శంకర్ ఇప్పటికే వేసవి విడుదలను ధ్రువీకరించారు, త్వరలోనే డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సినిమా (latest telugu movies)రిలీజ్ కాకముందే తన సత్తా చాటుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి రికార్డులను తిరగరాసింది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్తో అభిమానులు ఊగిపోతున్నారు (latest telugu cinema news).
పవన్ సరసన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. వీరిద్దరి గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ‘ఓజీ’ విజయంతో పవన్ కళ్యాణ్ మార్కెట్ మరో స్థాయికి చేరింది. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (upcomeing telugu movies) అంతకు మించిన విజయం సాధిస్తుందని, హరీష్ శంకర్ తన మార్క్ డైలాగులతో పవన్ను పవర్ఫుల్గా చూపిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ ఈ లీకైన డేట్నే ఫైనల్ చేస్తారో లేదో చూడాలి.