దేవర2పై నిర్మాత అప్‌డేట్‌..ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి

Viswa

Web Stories

Devara2: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ‘దేవర’ (Devara 2 news)  సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్‌ ఉండబోదని గతంలోనే పెద్ద ప్రచారం సాగింది. కానీ ‘దేవర 2’ సినిమా ఉంటుందని, ‘మ్యాడ్‌ 2’ సినిమా సక్సెస్‌మీట్‌కు అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ చెప్పారు.

బ్రిటిషర్లపై రణబాలి తిరుగుబాటు

కానీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ‘దేవర 2’ చిత్రం ఇక ఉండదనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ‘దేవర 2’ సినిమా ఉంటుందని ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన మిక్కిలినేని సుధాకర్‌ చెప్పడం, ఎన్టీఆర్‌ అభిమాలను ఖుషి చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిక్కిలినేని సుధాకర్‌ ‘దేవర 2’ సినిమా చిత్రీకరణ మేలో ప్రారంభం అవుతుందని, 2027లో ఈ సినిమా రిలీజ్‌ అవొచ్చని తెలిపారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు (Telugucinema news).

ఇరుముడి సినిమా రవితేజకు హిట్‌ ఇస్తుందా?

మరోవైపు ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌తో ‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమాతో ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలే క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేశారు. త్వరలోనే యూనిట్‌ జోర్డాన్‌ వెళ్లనున్నారు. ఇక ఈ సినిమాను జూన్‌ 25న రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా, ‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమా ఈ తేదీకి విడుదల కాక పోవచ్చు. కానీ మేకర్స్‌ మాత్రం ఈ ఏడాదికే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు (Ntr Devara2 news)

Devara2 Update: వాళ్లకు చెప్తున్నా…దేవర2తో వస్తున్నా!

ఇక ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయగా, జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించారు. సైఫ్‌అలీఖాన్‌, ప్రకాష్‌రాజ్‌, అజయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi