టాప్‌టెన్‌లో ఉంటావ్‌ లే…!

Viswa
1 Min Read

Web Stories

Srinivasa Mangapuram Teaser: సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni )హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ ( Srinivasa Mangapuram Teaser). ఈ పీరియాడికల్‌ రూరల్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరీ సినిమాలో రషా తడాని హీరోయిన్‌ (బాలీవుడ్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ కుమార్తె). మోహన్‌బాబు విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ అజయ్‌భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సిని మాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Srinivasa Mangapuram movie teaser
Srinivasa Mangapuram movie teaser

తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌లో ‘ఈక్షణం..ఇప్పటికిప్పుడు..నీకెమనిపిస్తుంది…:!, నేనసలు నీ ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉన్నానా..టాప్‌ టెన్‌లో ఉంటావ్‌ లే..!, మంగ లేకుండా ఈ శ్రీనుగాడు..తిరుపతి వదలివెళ్లే ప్రసక్తే లేదు…!’ వంటి డైలాగ్స్‌ ఉన్నాయి. కథ రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నట్లుగా తెలుస్తోంది. టీజర్‌లో మోహన్‌బాబు ఒక్క డైలాగ్‌ కూడా లేదు. హీరో, హీరోయిన్ల ప్రజెన్స్‌ బాగున్నాయి. జయకృష్ణ హీరోగా మంచి లుక్స్‌తో కనిపిస్తున్నాడు. బ్రహ్మాజీ, అజయ్, నరేశ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వనీదత్‌ సమర్పణలో జెమిని కిరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌డేట్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

Please Share
Share This Article
1 Comment
  • Методика подбирается не только исходя из медицинских показаний, но и личных ожиданий пациента, его опыта и жизненной ситуации. Такой подход позволяет сделать процесс максимально комфортным и результативным.
    Разобраться лучше – http://kodirovanie-ot-alkogolizma-ehlektrostal6.ru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi